BRO RECRUITMENT 2021 APPL FOR 354 VEHICLE MECHANIC AND OTHER POSTS NS
BRO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
నిరుద్యోగులకు శుభవార్త.. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 354 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత రక్షణ శాఖ పరిధిలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల ను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వెహికల్ మెకానిక్ తో పాటు పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (notification) పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 354 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు bro.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాళీలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. డిటైల్డ్ నోటిఫికేషన్ ను అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. అయితే ప్రస్తుతం సాంకేతిక కారణాలతో అధికారిక వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. అధికారిక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. Jobs in AP: ఏపీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ఇదిలా ఉంటే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) సైతం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (notification) స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 72 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. NPCIL యొక్క నరోరా అటామిట్ పవర్ స్టేషన్ లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. స్టైఫండరీ ట్రైనీ, ఫార్మసిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అసిస్టెంట్, నర్స్, Steno విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,900 వరకు వేతనం చెల్లించనున్నారు. ట్రైనీ ఖాళీలకు ఎంపికైన వారిని రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.