BRAOU Admissions: డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అప్లై చేయండి ఇలా

BRAOU Admissions | దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకునేవారికి మరో అవకాశం అందిస్తోంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.

news18-telugu
Updated: May 28, 2020, 11:42 AM IST
BRAOU Admissions: డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అప్లై చేయండి ఇలా
BRAOU Admissions: డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తూనే చదవాలనుకుంటున్నారా? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-BRAOU మంచి అవకాశాన్ని ఇస్తోంది. మీరు డిస్టెన్స్ లోనే బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలను పూర్తి చేయొచ్చు. డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకునేవారికోసం అడ్మిషన్ ప్రక్రియ చేపట్టింది. ఎప్పట్లాగే ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తోంది. ఇంటర్ పాస్ కానివాళ్లు 2020 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండితే చాలు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయొచ్చు. ఈ టెస్ట్ పాసైనవారికి డిగ్రీలో అడ్మిషన్ లభిస్తుంది. ఇంటర్ పాసైనవాళ్లు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా డిస్టెన్స్ డిగ్రీలో అడ్మిషన్ పొందొచ్చు. 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయినవాళ్లు మళ్లీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు.

వాస్తవానికి బీఆర్ఏఓయూ ఎలిజిబిలిటీ టెస్ట్-2020 ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసింది యూనివర్సిటీ. జూలై 12న పరీక్ష జరగనుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో పరీక్ష ఉంటుంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దరఖాస్తు చేయలేకపోయినవారికి మరో అవకాశం ఇచ్చేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను జూన్ 25 వరకు పొడిగించింది అంబేద్కర్ యూనివర్సిటీ. ఆసక్తిగలవాళ్లు జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై క్లారిటీ... రిజల్ట్స్ ఎప్పుడంటే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

TCS Internship: ఇంట్లో కూర్చొనే టీసీఎస్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు ఇలా
Published by: Santhosh Kumar S
First published: May 28, 2020, 11:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading