news18-telugu
Updated: August 21, 2020, 6:41 PM IST
BRAOU Admissions 2020: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)
జాబ్ చేస్తూ చదువుకోవాలనుకునేవారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో యూనివర్సిటీలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-BRAOU అడ్మిషన్లు ప్రారంభించింది. బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో అప్లై చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Telangana DOST 2020: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-BRAOU గతంలో నిర్వహించిన అర్హత పరీక్షల్లో పాసైనవారు డిగ్రీ కోర్సుల్లో నేరుగా జాయిన్ కావొచ్చు. 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయినవాళ్లు డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చని యూనివర్సిటీ ప్రకటించింది. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఇక ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు సెకండియర్, థర్డ్ ఇయర్ ఫీజును 2020 సెప్టెంబర్ 10 లోగా ఆన్లైన్లో చెల్లించొచ్చు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 నెంబర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్ 040-23680333/555 నెంబర్లకు కాల్ చేయొచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
August 21, 2020, 6:41 PM IST