GK Questions : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇటీవల ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్‌ఎస్ (IFS) సర్వీసులకు 1105 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 28న పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాల్లో మిగిలిన పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో కొలువు సాధించాలంటే జనరల్ నాలెడ్జి (General Knowledge) చాలా కీలకం. కరెంట్ అఫైర్స్ (Current Affairs) ఎప్పటికప్పుడు మారిపోతుంది. దానికి అనుగుణంగా వాటిని ఫాలో అవ్వక తప్పదు. జనరల్ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మారదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం. ఇవి మీకు తెలుసేమో ఒకసారి ప్రయత్నించండి.
1. డీఆర్‌డీవో (DRDO) ప్రధాన కార్యాలయం (Headquarter) ఎక్కడ ఉంది.
ఎ. ముంబాయి
బి. బెంగళూరు
సి.హైదరాబాద్
డి. న్యూఢిల్లీ
సమాధానం: (డి) న్యూఢిల్లీ
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (Indian Institute of Foreign Trade) ఎక్కడ ఉంది?
ఎ. హైదరాబాద్
బి. న్యూఢిల్లీ
సి. అహ్మదాబాద్
డి. ముంబాయి
సమాధానం: (బి) న్యూఢిల్లీ
3. దేశంలో అతిపెద్ద నది ఏది?
ఎ. యమున
బి. గంగ
సి. బ్రహ్మపుత్ర
డి. కావేరీ
సమాధానం: (బి) గంగ
4. ‘సెవెన్ సిస్టర్స్’గా పిలవబడే ఏడు రాష్ర్టాల్లో కానిది ఏది?
ఎ. సిక్కిం
బి. మేఘాలయ
సి. త్రిపుర
డి. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం: (ఎ) సిక్కిం
బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా?సోలో వ్యక్తులు వాలంటైన్స్ డేని ఇలా ఎంజాయ్ చేయొచ్చు
5. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఏది?
ఎ. భూమి
బి. గురుడు
సి. బుధుడు
డి. నెప్ట్యూన్
సమాధానం: (సి) బుధుడు
6. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏది?
ఎ. టాకా
బి. రూపాయి
సి. డాలర్
డి. దినార్
సమాధానం: (ఎ) టాకా
7. పిన్ వేలీ నేషనల్ పార్క్ (Pin Valley National Park) ఎక్కడ ఉంది?
ఎ. ఉత్తర్ ప్రదేశ్
బి. ఉత్తరాఖండ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. గుజరాత్
సమాధానం: (సి) హిమాచల్ ప్రదేశ్
8. రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. 26 నవంబర్
బి. 24 నవంబర్
సి. 25 నవంబర్
డి. 28 నవంబర్
సమాధానం: (ఎ) 26 నవంబర్
9. ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది?
ఎ. అమెజాన్
బి. నైలు
సి. రియో డి లా ప్లాటా
డి. ఎల్లో రివర్
సమాధానం: (బి) నైలు
10. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు ఎవరు?
ఎ. జిన్ పింగ్
బి. ఆరిఫ్ అల్వీ
సి. జోకో విడోడో
డి. వ్లాదిమిర్ పుతిన్
సమాధానం: (డి) వ్లాదిమిర్ పుతిన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, General knowledge, JOBS