హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GK Questions: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ జీకే ప్రశ్నలకు ఆన్సర్ తెలుసేమో చెక్ చేయండి..

GK Questions: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ జీకే ప్రశ్నలకు ఆన్సర్ తెలుసేమో చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GK Questions: మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే.. మీ జీకే నాలెడ్జ్‌ను టెస్ట్ చేసే టాప్-10 ప్రశ్నలు కొన్ని ఇస్తున్నాం, వాటికి ఆన్సర్ ఇవ్వగలరేమో చెక్ చేసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం దేశంలో రిక్రూట్స్‌మెంట్స్ (Recruitments) హవా నడుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకులు (Banks), వివిధ రాష్ట్ర రిక్రూట్‌మెంట్ బోర్డులు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) రిలీజ్ చేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ స్థాయి పెంచారు. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి జాబ్ రిక్రూట్‌మెంట్ వరకు.. ప్రతి పోటీ పరీక్షల్లో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ సెక్షన్‌ ఉంటోంది. దీంతో అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు జనరల్ నాలెడ్జ్‌పైన కూడా పట్టు సాధించాలి.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్‌ పైనే ఎక్కువ దృష్టి పెడతారు. అయితే స్టాక్ జీకేతో పాటు కరెంట్ ఈవెంట్స్‌పై కూడా అవగాహన పెంచుకోవాలి. జీకే సెక్షన్ నుంచి వచ్చే ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ ఇచ్చేలా ప్రిపేర్ అయితే, మంచి స్కోర్ సాధించవచ్చు. ఇలా వివిధ పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి న్యూస్ 18 నెట్‌వర్క్ ‘బ్రెయిన్ టీజర్’ పేరుతో స్పెషల్ జీకే కాలమ్‌ను అందిస్తోంది. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే.. మీ జీకే నాలెడ్జ్‌ను టెస్ట్ చేసే టాప్-10 ప్రశ్నలు కొన్ని ఇస్తున్నాం, వాటికి ఆన్సర్ ఇవ్వగలరేమో చెక్ చేసుకోండి.

* స్టాట్యూ ఆఫ్ యూనిటీ వాస్తుశిల్పి ఎవరు?

సమాధానం: రామ్ వి సుతార్

* భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు?

సమాధానం: లార్డ్ కానింగ్

* భోపాల్‌లో ఉన్న భారత్ భవన్‌ను ఎవరు డిజైన్ చేశారు?

సమాధానం: నార్త్ చార్లెస్ కొరియా

* భారత పార్లమెంటు భవనం ఆర్కిటెక్ట్ ఎవరు?

సమాధానం: ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్

* ఢిల్లీ చలో నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

సమాధానం: సుభాష్ చంద్రబోస్

* చండీగఢ్ నగరానికి ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు?

సమాధానం: ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లే కార్బుసియర్

* బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం, ఆ దేశంలోని ప్రాంతం ఏది?

సమాధానం: చైనా, ఉత్తర చైనా

* కోల్‌కతాలో ఉన్న విక్టోరియా మెమోరియల్ ఆర్కిటెక్ట్ ఎవరు?

సమాధానం: విలియం ఎమర్సన్

* తాజ్ మహల్‌ను ఎవరు రూపొందించారు? దీని డిజైనర్ ఎవరు?

సమాధానం: ఉస్తాద్ అహ్మద్ లాహోరీ

* ఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ లోటస్ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఎవరు?

సమాధానం: ఫరీబోర్జ్ సాహిబా

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, GK Capsule, Gk questions, JOBS

ఉత్తమ కథలు