Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 3348 జాబ్స్... పోస్టులు ఇవే

BPNL Recruitment 2020 | భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్-BPNL మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 20, 2020, 10:36 AM IST
Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 3348 జాబ్స్... పోస్టులు ఇవే
Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 3348 జాబ్స్... పోస్టులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత పశుసంవర్ధక కార్పొరేషన్ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్-BPNL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 3348 పోస్టుల్ని ప్రకటించింది. సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం http://www.bharatiyapashupalan.com/ వెబ్‌సైట్‌ చూడండి.

BPNL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 3348
సేల్స్ అసిస్టెంట్- 2700
సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- 540
సేల్స్ మేనేజర్- 108

IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివేNational Recruitment Agency: నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే

BPNL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
విద్యార్హతలు- సేల్స్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఇంటర్మీడియట్, సేల్స్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ.
వయస్సు- సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు, సేల్స్ మేనేజర్ పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు.
వేతనం- సేల్స్ అసిస్టెంట్‌కు రూ.15,000, సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.18,000, సేల్స్ మేనేజర్‌కు రూ.21,000.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
Published by: Santhosh Kumar S
First published: August 20, 2020, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading