భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Bharat Petroleum Corporation Limited) పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అండ్ టెక్నిషియన్(Technician) అప్రెంటీస్(Apprentice) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్ లో ఉంటాయి.
ఖాళీల వివరాలు..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నోటిఫికేషన్ 2021 ద్వారా 87 గ్రాడ్యుయేట్ అండ్ టెక్నిషియన్ అప్రెంటీస్ పోస్టులు(Posts) భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు |
క్యాటగిరీ-1 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ | 42 | ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. 6.3 జీపీఏ సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5.3 జీపీఏ వచ్చి వారు కూడా అర్హులే |
క్యాటగిరీ-2 టెక్నిషియన్ (డిప్లమా) అప్రెంటీస్ | 45 | ఫస్ట్ క్లాస్ లో డిప్లమా చేసి ఉండాలి. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించినవారు కూడా అర్హులే |
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో ఖాళీలు..
విభాగం | ఖాళీలు |
కెమికల్ ఇంజనీర్ | 11 |
సివిల్ ఇంజనీర్ | 08 |
ఎలక్ట్రికల్ ఇంజనీర్ | 05 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 03 |
ఇన్ స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్ | 02 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 13 |
మొత్తం | 42 |
టెక్నిసియన్ (డిప్లమా) అప్రెంటీస్ విభాగంలో ఖాళీలు
పోస్టులు | ఖాళీలు |
కెమికల్ ఇంజనీరింగ్ | 05 |
సివిల్ ఇంజనీరింగ్ | 07 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 08 |
ఇన్ స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ | 08 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 17 |
మొత్తం | 48 |
DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఎంపిక విధానం..
- ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఇంటర్వ్యూ ఎంపిక అకడమిక్(Academic) ఇయర్లో వచ్చిన మార్కుల(Marks) ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- మార్కుల ప్రాధాన్యతలో ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కొంత మినహాయింపు ఉంటుంది.
- మెడికల్(Medical) పరీక్షలో పాసైన అభ్యర్థులను ఆయా విభాగాల్లో ప్రావీణ్యత(Skill) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకొనే విధానం..
- ఆసక్తి గల విద్యార్థులు బీపీసీఎల్ నోటిఫికేషన్(Notification)ను చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- అనంతరం అధికారిక వెబ్సైట్ https://www.bharatpetroleum.com ను సందర్శించాలి. (అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
- నోటిఫికేషన్ పరిశీలించిన తరువాత అర్హతలు ఉన్నవారు మాత్రమే అప్లికేషన్ ఫాం నింపాలి.
- అప్లికేషన్ ఫాంలో మీరు వినియోగిస్తున్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇవ్వాలి.
- వీటిని తప్పుగా ఇస్తే సరిచేయడం కష్టం.. ఎంపిక విధానంలో మీకు సమాచారం వీటి ద్వారానే అందిస్తారు.
- దరఖాస్తు పూర్తి చేసిన తరువాత సబ్మిట్(Submit) చేయాలి.
- ఈ దరఖాస్తుకు సెప్టెంబర్ 24, 2021 వరకు అవకాశం.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు రావాల్సిన తేదీ సమయం, స్థలం మెయిల్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Engineering, Government jobs, Govt Jobs 2021, Job notification