చేతుల్లేవు... కాలితో పరీక్ష రాసి రిజల్ట్స్‌లో అదరగొట్టాడు

తినడం, స్నానం చేయడం, మొబైల్, ల్యాప్‌టాప్ ఉపయోగించడం లాంటివన్నీ కాళ్లతోనే సులువుగా చేసేస్తాడు. 2010లో బిక్రమ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి నేషనల్ చైల్డ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ లభించడం విశేషం.

news18-telugu
Updated: May 10, 2019, 5:15 PM IST
చేతుల్లేవు... కాలితో పరీక్ష రాసి రిజల్ట్స్‌లో అదరగొట్టాడు
చేతుల్లేవు... కాలితో పరీక్ష రాసి రిజల్ట్స్‌లో అదరగొట్టాడు
  • Share this:
అతనికి పుట్టుకతోనే చేతుల్లేవు. కానీ ఎన్నడూ అధైర్యపడలేదు. చదువులోనూ డీలా పడలేదు. తనకున్న రెండు కాళ్లే చేతులు అనుకున్నాడు. ఎప్పుడు పరీక్షలున్నా కాళ్లతో రాయడమే అలవాటు. ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రాశాడు. 72 శాతం మార్కులతో పాసై అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనే బిక్రమ్ భట్టారై. సిక్కింలోని సామా లింగ్డుమ్ గ్రామానికి చెందిన నర్పతి బట్టారై, జనుక దంపతుల తనయుడు. ఇతని వయస్సు 16 ఏళ్లు. పుట్టుకతోనే చేతులు లేకపోయినా చదువుకు అదేమీ పెద్ద లోపం కాదనుకున్నాడు. అతని ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చదువులో మంచి రికార్డులు సాధిస్తూ వచ్చాడు. కాలితోనే పరీక్షలు రాశాడు. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బిక్రమ్, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మంచి మార్కులతో పాసయ్యాడు.

బోర్డ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులతో సంతోషంగా ఉన్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. నా కుటుంబమే నాకు అతిపెద్ద బలం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మద్దతుగా నిలిచారు. నా తల్లిదండ్రులు గర్వించేలా స్థిరపడాలని అనుకుంటున్నాను.
బిక్రమ్ బట్టారై, సీబీఎస్ఈ 11వ తరగతి విద్యార్థి


11వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఎంచుకున్నాడు బిక్రమ్. అతని ప్రతిభ చూసి తల్లిదండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బిక్రమ్ చిన్ననాటి నుంచి తెలివైనవాడని, అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అతని తండ్రి చెబుతున్నారు. తినడం, స్నానం చేయడం, మొబైల్, ల్యాప్‌టాప్ ఉపయోగించడం లాంటివన్నీ కాళ్లతోనే సులువుగా చేసేస్తాడు. 2010లో బిక్రమ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి నేషనల్ చైల్డ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ లభించడం విశేషం. కాళ్లూచేతులు అన్నీ సవ్యంగా ఉన్నా, బుద్ధిగా చదువుకోలేక, పరీక్షలు రాయలేకపోతున్నవారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ విద్యార్థి.Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>