Home /News /jobs /

BORDER SECURITY FORCE RECRUITMENT 2022 APPLY FOR STENOGRAPHER AND HEAD CONSTABLE POSTS LAST 6 SEPTEMBER KNOW DETAILS HERE VB

Constable-Stenographer Posts: ఇంటర్ అర్హతతో.. హెడ్ కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Constable-Stenographer Posts: BSF లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 324 పోస్టులను నియమించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(Boarder Security Force) ASI (Stenographer) అండ్ హెడ్ కానిస్టేబుల్(Head Constable) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ BSFలో 324 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు BSF అధికారిక సైట్‌ని rectt.bsf.gov.in సందర్శించడం ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 8న ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 6, 2022 వరకు కొనసాగుతుంది. 312 హెచ్‌సి (మినిస్టీరియల్) మరియు 11 ఎఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తారు. అర్హత, జీతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

New Update In WhatsApp: వాట్సాప్ లో అద్భుత ఫీచర్.. ఇక వాటిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు..


అర్హతలు..
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.



ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తారు. ASI(స్టెనోగ్రాఫర్) కోసం షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు..
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అభ్యర్థి దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించవలసి ఉంటుంది. అభ్యర్థి ఆన్‌లైన్ మోడ్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్, UPI, వాలెట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

-ముందుగా అభ్యర్థులు BSF రిక్రూట్‌మెంట్ 2022 rectt.bsf.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

- ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో అప్లై నౌపై క్లిక్ చేయండి.

-ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుది. దానిలో మీ వివరాలను నమోదు చేసుకోవాలి.

-ఆ తర్వాత BSF రిక్రూట్‌మెంట్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

- ఇప్పుడు అభ్యర్థులు ఏ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో ఎంచుకొని.. దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

- ఆ తర్వాత వివరాలను సమర్పించి, అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

-ఇప్పుడు దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్ ను సబ్ మిట్ చేస్తే.. దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్లే.

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Central Govt Jobs, JOBS, Police

తదుపరి వార్తలు