డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFలో 1312 హెడ్ కానిస్టేబుల్ (Head Constable) పోస్టుల భర్తీకి దరఖాస్తులను(Applications) కోరింది. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు BSF అధికారిక సైట్‌ని rectt.bsf.gov.in సందర్శించడం ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19, 2022. BSF రిక్రూట్మెంట్ 2022 కోసం అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర సమాచారం అంతా ఇక్కడ తెలుసుకోండి.
ఖాళీల సంఖ్య
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు
అర్హత..
BSF రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI) నుండి రేడియో అండ్ టెలివిజన్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్/ డేటా ప్రిపరేషన్ మరియు కంప్యూటర్ సాఫ్ట్వేర్/ జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా డేటా ఎంట్రీలో రెండేళ్ల సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 19 సెప్టెంబర్ 2022 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము
-Gen/OBC/EWS అభ్యర్థులలు రూ.100 చెల్లించాలి. వీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇ-చలాన్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించొచ్చు.
-SC/ST/Ex-S అభ్యర్థులకు.. ఎలాంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు
హెడ్ కానిస్టేబుల్ RO/RM రిక్రూట్మెంట్ 2022కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 20 ఆగస్టు, 2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19 సెప్టెంబర్, 2022
ఎంపిక ప్రక్రియ..
BSF రిక్రూట్మెంట్ 2022 కోసం అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, టెస్టిమోనియల్స్/పత్రాల ధృవీకరణ, PST అండ్ వైద్య పరీక్ష (DME) ఆధారంగా ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి..
Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.
Step 2 : తర్వాత కనిపించే విండలో అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ కు ఎంచుకోవాలి.
Step 3 : మరో విండో ఓపెన్ అవుతంది. దీనిలో క్యాడిడేట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది.
Step 4 : తర్వాత మొబైల్ అండ్ ఈమెయిల్ కు ఓటీపీ వస్తుంది. వాటిని ఎంటర్ చేసి కన్ ఫాం చేయాలి.
Step 5 : కొత్తగా ఓపెన్ అయినా విండో వ్యక్తిగత వివరాలను ఇచ్చి దరఖాస్తును ఆన్ లైన్ విధానంలో సమర్పించాలి.
Step 6 : చివరగా దరఖాస్తు చేసుకున్న ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Police, Ts constable, Women constables