బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(Boarder Security Force) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రహోం మంత్రిత్వశాఖలో భాగంగా ఉండే ఈ విభాగంలో భారీగా పోస్టునుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1284 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1220 పురుషులకు, 64 మహిళలకు కేటాయించారు. కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం https://rectt.bsf.gov.in/ ఈ లింక్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 27, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మరో నోటిఫికేషన్ లో..
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ రెండు కేటగిరీ ఉద్యోగాలను పర్మినెంట్ ఉద్యోగాలు కాగా.. తాత్కాళిక ప్రాతిపదికన ప్రాజెక్టు ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్(Medical Officer), సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మార్చి 08 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 06 వరకు ఉండనుంది. మరి కొన్ని పోస్టులకు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల యొక్క ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విశాఖపట్నం , హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఇంటర్వ్యూలు ఉంటాయి. మార్చి 23న ఈ ప్రక్రియ ఉండనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.