బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) పలు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్-సి(నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, Inter(12), వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://rectt.bsf.gov.in/ సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెటర్నరీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 18 ఖాళీగా ఉన్నాయి. కన్నెల్ మ్యాన్ కానిస్టేబుల్ 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు.. వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫిజు రూ. 100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 20, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎంపిక విధానం
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు హెడ్ కానిస్టేబుల్‌కి రూ.25,500 - రూ.81,100 చెల్లిస్తారు.
కానిస్టేబుల్‌కు రూ.21,700 - రూ.69,100 మధ్య చెల్లిస్తారు.
ఇలా అప్లై చేయండి:
Step 1: అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ (https://rectt.bsf.gov.in/) ను ఓపెన్ చేయండి.
Step 2: అనంతరం Apply here ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3: అనంతరం కొత్త పేజి ఓపెన్ అవుతుంది. దీనిలో వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
Step 4: తర్వాత ఓటీపీని.. ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్, విద్యార్హత వివరాలను నమోదు చేసి.. దరఖాస్తును పూర్తి చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.