BORDER SECURITY FORCE BSF INVITES APPLICATIONS FOR 317 SI AND HEAD CONSTABLE POSTS APPLY BEFORE MARCH 15 SS
BSF Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో బీఎస్ఎఫ్లో 317 జాబ్స్... మార్చి 15 లాస్ట్ డేట్
BSF Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో బీఎస్ఎఫ్లో 317 జాబ్స్... మార్చి 15 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)
BSF Recruitment 2020 | బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. మొత్తం 317 ఉద్యోగాల భర్తీకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF మొత్తం 317 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. వేర్వేరు విభాగాల్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. గ్రూప్ బీ, సీలో భర్తీ చేస్తున్న పోస్టులివి. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ ఖాళీ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తుంది. అధికారిక వెబ్సైట్స్ http://www.bsf.gov.in/ లేదా http://www.bsf.nic.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. లేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ / రోజ్గార్ సమాచార్ పత్రికలో కూడా నోటిఫికేషన్ వివరాలుంటాయి. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2020 మార్చి 15 చివరి తేదీ.
నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15
విద్యార్హత- ఎస్సై పోస్టుకు 12వ తరగతి, హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 10వ తరగతి, టెక్నికల్ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా.
వయస్సు- ఎస్సై పోస్టులకు 22 నుంచి 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 20 నుంచి 26 ఏళ్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.