నిరుద్యోగులకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) శుభవార్త చెప్పింది. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 459 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 195 పోస్టులు అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉండగా, ఓబీసీ కేటగిరీలో 121, ఎస్సీలకు 66, EWS కేటగిరీలో 45, ఎస్టీ అభ్యర్థులకు మరో 32 కేటాయించారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మహిళలు అప్లై చేయవద్దని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ విడుదలైన 45 రోజుల వరకు అప్లికేషన్లను అంగీకరించనున్నారు. వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటఫికేషన్లో చూడొచ్చు.
డ్రాట్స్‌మెన్ విభాగంలో 43, రేడియో మెకానిక్ 4, స్టోర్ సూపర్వైజర్ 11, ల్యాబ్ అసిస్టెంట్ 1, మల్టీస్కిల్డ్ వర్కర్ (మాసన్) 100, డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్ 150, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగంలో 150 పోస్టులు ఉన్నాయి.
ఎలా అప్లై చేయాలంటే..
-అభ్యర్థులు కేవలం ఆఫ్ లైన్ మోడ్ లోనే అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇందు కోసం అభ్యర్థులు ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు మొదట
bro.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది
- అనంతరం ‘Publication of vacancies for recruitment against ADVT No 01/2021’ పేరుతో కనిపిస్తున్న లింక్ ను ఓపెన్ చేయాలి.
-అనంతరం advertisement లింక్ కనిపిస్తుంది. దానికి ఓపెన్ చేయాలి.
-దీంతో మీకు advertisement ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.
-ఆ ఫామ్ పై వివరాలు నింపి సంతకం చేయాల్సి ఉంటుంది. ఓ ఫొటో కూడా అంటించాల్సి ఉంటుంది.
-ఆ ఫామ్ ను నోటిఫికేషన్లో సూచించిన విధంగా GREF Centre, Dighi Camp, Alandi Road, Pune - 411015 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
-అప్లై చేయడానికి ముందు అభ్యర్థులు అర్హతలు, ఇతర వివరాలను నోటిఫికేషన్లో స్పష్టంగా చదువుకుంటే మంచిది.
Application Form-Direct Link