కేంద్ర ప్రభుత్వ కొలువులకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త. ఐటీఐ పూర్తి చేసిన వారికి మంచి అవకాశం. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(BRO) 567 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యునికేషన్, డ్రిల్లర్, పెయింటర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను bro.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఈ సంవత్సరం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి విడుదలైన మొదటి జాబ్ నోటిఫికేషన్‌గా చెప్పుకోవచ్చు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా 567 పోస్టులను భర్తీచేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టుల వివరాలిలా..
పోస్టు పేరు | ఖాళీలు |
వెహికల్ మెకానిక్ | 236 |
ఆపరేటర్ కమ్యునికేషన్ | 154 |
MSW మేసన్ | 149 |
MSW పెయింటర్ | 5 |
రేడియో మెకానిక్ | 2 |
MSW మెస్ వెయిటర్ : | 1 |
‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 2023’నోటిఫికేషన్‌ను 2023 జనవరి 2న రిలీజ్ చేశారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివవారలను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://www.bro.gov.in/లో పొందవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు 2023, ఫిబ్రవరి 13 తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్టంగా 27 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మొబైల్ ద్వారా చేయకపోవడం మంచిది. మొబైల్ నుంచి అప్లై, పేమెంట్ చేస్తే కొన్ని సార్లు సర్వర్ సమస్యలు తలెత్తుతాయి.
Step 1 : ముందుగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఈ అధికారిక వెబ్సైట్‌లో https://www.bro.gov.in/ లాగిన్ అవ్వాలి.
Step 2 : హోమ్‌పేజ్‌లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి పేరును, ఇతర వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
Step 3 : అవసరమైన డాక్యుమెంట్లను అన్నింటినీ అప్‌లోడ్ చేయాలి.
Step 4 : దరఖాస్తు చేయడానికి ముందుగానే విద్యార్హత, కుల దృవీకరణ, ఆధార్ కార్డు లాంటి వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి.
Step 5 : నోటిఫికేషన్‌లనో అడిగిన సైజు ఫార్మాట్‌లోనే డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తుకు సంబంధించిన పేమెంట్ ఆన్‌లైన్ లేదంటే బ్యాంకు ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్‌లో యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.50ను అప్లికేషన్ పేమెంట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు తేదీ పూర్తి అయ్యేలోపు.. అంటే 2023 ఫిబ్రవరి 13కి ముందు పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డు వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bro jobs, Career and Courses, Central Government Jobs, JOBS, Jobs Exams