BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BOI Recruitment 2020 | బ్యాంక్ ఆఫ్ ఇండియా 214 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 15, 2020, 11:34 AM IST
BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకింగ్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? అందుకు తగ్గ విద్యార్హతలు, అనుభవం మీకు ఉన్నాయా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్ 4 వరకు వేర్వేరు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 214 ఖాళీలున్నాయి. ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... రూ.54,000 స్టైపెండ్

Amazon Jobs: అమెజాన్‌లో ఉద్యోగాల ధమాకా... 1,00,000 జాబ్స్ ప్రకటించిన కంపెనీ

BOI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 214
ఎకనమిస్ట్- 4
స్టాటిస్టీషియన్- 2రిస్క్ మేనేజర్- 9
క్రెడిట్ అనలిస్ట్- 60
క్రెడిట్ ఆఫీసర్- 79
ఐటీ (ఫిన్‌టెక్)- 30
ఐటీ (డేటా సైంటిస్ట్)- 3
ఐటీ (డేటా అనలిస్ట్)- 9
ఐటీ (ఇన్ఫో సెక్యూరిటీ)- 8
టెక్ అప్రైజల్- 10

Degree Fellowship: డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000... అప్లై చేయండిలా

Ecom Express Jobs: బీ రెడీ... 30,000 ఉద్యోగాలు ప్రకటించిన ఇ-కామ్ ఎక్స్‌ప్రెస్

BOI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 30
ఆన్‌లైన్ ఎగ్జామ్- త్వరలో తేదీ వెల్లడించనున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.
ఎంపిక విధానం- దరఖాస్తుల పరిశీలన, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ.
Published by: Santhosh Kumar S
First published: September 15, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading