Home /News /jobs /

BOB RECRUITMENT 2022 FOR IT PROFESSIONAL POSTS APPLY ONLINE UMG GH

BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఫుల్ డీటైల్స్ ఇవిగో!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.

ఐటీ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. 

ఇంకా చదవండి ...
ఐటీ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2022 జూలై 7 గా నిర్ణయించారు.

ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ లేదా.. డోంట్‌వర్రీ! ఈ ఐదు స్కూటర్లు మీకోసమే ప్రత్యేకంగా..!


ఖాళీల వివరాలు
డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్- 2 పోస్టులు
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్- 6 పోస్టులు
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్- 2 పోస్టులు
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ - 4 పోస్టులు

ఇదీ చదవండి: అబ్బో ఈమెది మామూలు బుర్ర కాదయ్యో..! చిన్న ట్రాకర్‌తో బాయ్‌ఫ్రెండ్‌నే మర్డర్ చేసింది..


అర్హత ప్రమాణాలు
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు AICTE/UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ చేసి ఉండాలి. లేకపోతే బీటెక్/బీఈలో కనీసం 60 శాతం మార్కులతో.. ఐటీ లేదా డేటా సైన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ చేసి ఉండాలి.
డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజినీర్ పోస్టుల కోసమైతే.. AICTE/UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఇదీ చదవండి: రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?


ఎక్స్‌పీరియన్స్ వివరాలు
డేటా సైంటిస్ట్ పోస్ట్: BFSI సెక్టార్‌లో ఐటీ/డేటా సైన్స్‌లో కనీసం 6 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అందులో డేటా సైంటిస్ట్‌గా కనీసం 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
డిప్యూటి వైస్ ప్రెసిడెంట్: BFSI సెక్టార్‌లో IT/డేటా సైన్స్‌లో.. డేటా ఇంజినీర్ అండ్ అసిస్టెంట్ గా కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంతేకాకుండా డేటా సైంటిస్‌గా 1 సంవత్సరం పనిచేసి ఉండాలి.
వైస్ ప్రెసిడెంట్: BFSI సెక్టార్‌లో ITలో కనీసం 6 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అలాగే బిగ్ డేటా టెక్నాలజీలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
డేటా ఇంజనీర్ పోస్ట్: BFSI సెక్టార్‌లో ITలో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్ పీరియన్స్‌తో పాటు బిగ్ డేటా టెక్నాలజీలో ఒక సంవతర్సం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

ఇదీ చదవండి: నాన్నతో నీ ప్రయాణం.. ఒక్కరోజు ఆయనతో ఇలా ఉండండీ..!


వయోపరిమితి
డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్ పోస్టుకు 28 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్- డేటా సైంటిస్ట్ పోస్టుకు- 25 నుంచి 35 ఏళ్లు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్- డేటా ఇంజినీర్ పోస్టుకు - 28 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్- డేటా ఇంజినీర్ పోస్టుకు- 25 నుంచి 32 ఏళ్లు వయసు ఉండాలని పేర్కొన్నారు.



దరఖాస్తు విధానం
ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ www.bankofbaroda.in/Career.htm ను సందర్శించాలి.
కెరీర్ ఆప్షన్‌‌లోకి వెళ్లి కరెంట్ ఆపర్చునిటీస్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
సంబంధిత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మాట్‌లో అభ్యర్థులు రిజిస్ట్రర్ చేసుకోవాలి.
డెబిట్ కార్డ్‌‌/ క్రెడిట్ కార్డ్ /ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
Published by:Mahesh
First published:

Tags: Bank Jobs, Bank of Baroda, Government jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు