BOB RECRUITMENT 2022 BANK OF BARODA RELEASED NOTIFICATION FOR VARIOUS JOB VACANCIES HERE FULL DETAILS NS
Bank Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ బ్యాంకులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు: అగ్రికల్చర్ మార్కెంటిగ్ ఆఫీసర్లు:ఈ విభాగంలో మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసిన వారు అర్హులు. ఇంకా సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వయస్సు 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. APPSC Job Notification: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. APPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల..
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (అక్విజేషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్): ఈ విభాగంలో 53 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్మెంట్)/సీఏ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఖాళీలకు అర్హులు. అభ్యర్థులకు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 26 నుంచి 40 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.