బ్యాంకు ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి అలర్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో వెల్త్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌ని నియమిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మొత్తం 346 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్), ఆపరేషన్స్ హెడ్-వెల్త్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 346 |
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ | 320 |
ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ | 24 |
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్) | 1 |
ఆపరేషన్స్ హెడ్-వెల్త్ | 1 |
Railway Jobs: రైల్వేలో పరీక్ష లేకుండా 3115 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలు ఇవే
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు NISM/ IRDA సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు NISM/ IRDA సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిన్నర అనుభవం తప్పనిసరి.
గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ఎం సేల్స్ హెడ్)- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ఆపరేషన్స్ హెడ్-వెల్త్- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఎంబీఏ లేదా తత్సమాన అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 20
వయస్సు- 24 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
వేతనం- విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ... దరఖాస్తు గడువు పెంపు
Step 1- ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 2- Current Opportunities క్లిక్ చేస్తే Recruitment of E-Wealth Relationship Managers నోటిఫికేషన్ కనిపిస్తుంది.
Step 3- Apply Now పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ అవుతుంది.
Step 4- పోస్టు పేరు, లొకేషన్, పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
Step 5- రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Step 6- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, Bank of Baroda, JOBS