Home /News /jobs /

BOB RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 198 MANAGERIAL POSTS HERE APPLICATION LINK NS

BOB Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో అప్లై చేశారు.

    బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తోంది. ఇటీవల 105 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బ్యాంక్ తాజాగా మరో 198 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఫిబ్రవరి 1ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ bankofbaroda.inలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు:
    -హెడ్ స్ట్రాటజీ (Head Strategy): 1 Post
    -నేషినల్ మేనేజర్ టెలీకాలింగ్ (National Manager Telecalling) 1 Post
    -హెడ్ ప్రాజెక్ట్&ప్రాసెస్ (Head Project & Process) 1 Post
    -నేషనల్ రిసీవబుల్స్ మేనేజర్ (National Receivables Manager): 3 Posts
    -జోనల్ రిసీవబుల్స్ మేనేజర్ (Zonal Receivables Manager): 21 Posts
    -వైస్ ప్రెసిడెంట్-స్ట్రాటజీ మేనేజర్ (Vice President - Strategy Manager): 3 Posts
    -డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (Dy. Vice President - Strategy Manager): 3 Posts
    -వెండర్ మేనేజర్ (Vendor Manager): 3 Posts
    -Compliance Manager: 1 Post
    -రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్ (Regional Receivables Manager): 48 Posts
    -MIS Manager: 4 Posts
    -కంప్లెయింట్ మేనేజర్ (Complaint Manager): 1 Post
    -ప్రాసెస్ మేనేజర్ (Process Manager): 4 Posts
    -అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-స్ట్రాటజీ మేనేజర్ (Asst. Vice President - Strategy Manager): 1 Post
    -ఏరియా రిసీవబుల్స్ మేనేజర్ (Area Receivables Manager): 50 Posts
    -అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (Assistant Vice President): 50 Posts
    -అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-ప్రొడక్ట్ మేనేజర్ (Assistant Vice President - Product Manager): 3 Posts

    అర్హతల వివరాలు: వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టు ఆధారంగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంసీఏ, సీఏ, ఎంబీఏ, పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

    ఎంపిక ప్రక్రియ: విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

    అప్లికేషన్ ఫీజు:
    అభ్యర్థులు అప్లై చేసుకునే సమయంలో రూ.600ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.





    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Current Opportunities ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Step 3: అనంతరం మనకు సంబంధించిన నోటిఫికేషన్ కింద Apply Now ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను నమోదు చేయాలి.
    Step 4: అప్లికేషన్ ఫామ్ నింపిన అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    Step 5: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, Bank of Baroda, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు