ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్సీ మెమోలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మార్క్స్ మెమోలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 10వ తరగతి విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్సైట్లో ఎస్ఎస్సీ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మార్క్స్, మెరిట్ ఆధారంగా ఫలితాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్ మెమోలను సంబంధిత స్కూళ్లకు పంపనుంది. విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి ఒరిజినల్ మార్క్స్ మెమోలు కలెక్ట్ చేసుకోవచ్చు.
AP SSC Memo Download: టెన్త్ మెమోలు డౌన్లోడ్ చేయండి ఇలా
10వ తరగతి విద్యార్థులు ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో SSC Public Examinations March 2020 Student Result & Short Memo Without Photo లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థులు ROLL NUMBER ఎంటర్ చేయాలి.
Submit పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన టెన్త్ మెమో కనిపిస్తుంది.
ఎస్ఎస్సీ మెమో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
ఫలితాల కాపీని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.