ఇంటర్ సిలబస్ తగ్గించాలా? అభిప్రాయాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వం

ఇంటర్మీడియట్ కాలేజీలు ఎప్పుడు తెరవాలి, సిలబస్ ఎంత కుదించాలి, ఏ పద్ధతిలో పాఠాలను బోధించాలి అన్న అంశాలపై పలు వర్గాల అభిప్రాయాలను కోరుతోంది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE.

news18-telugu
Updated: July 24, 2020, 4:53 PM IST
ఇంటర్ సిలబస్ తగ్గించాలా? అభిప్రాయాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వం
ఇంటర్ సిలబస్ తగ్గించాలా? అభిప్రాయాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. విద్యా వ్యవస్థ మళ్లీ ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు ఎప్పట్లోగా తెరుచుకుంటాయో తెలియదు. అడ్మిషన్ల ప్రక్రియకూ బ్రేక్ పడింది. ఈ విద్యాసంవత్సరాన్ని ఎలా గట్టెక్కించాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ కాలేజీల రీఓపెన్‌పై దృష్టిసారించింది. కాలేజీలను మళ్లీ తెరవడం, పనిదినాలను కుదించడం, సిలబస్ తగ్గించడం, బోధనా పద్ధతుల్ని మార్చడం లాంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. వీటిపై నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తోంది. అందుకే ఇంటర్ విద్యార్థులు, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగంపై అనుభవం ఉన్న నిపుణుల నుంచి అభిప్రాయాలను కోరుతోంది ఏపీ ప్రభుత్వం.

Jobs: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 220 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత

Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... జూలై 31 లాస్ట్ డేట్

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది. విద్యార్థులు, లెక్చరర్లు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎప్పుడు తెరవాలి, సిలబస్ ఎంత కుదించాలి, ఏ పద్ధతిలో పాఠాలను బోధించాలి అన్న అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చు. 2020 జూలై 31 సాయంత్రం 5 గంటల్లోగా అభిప్రాయాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సుల విషయంలో ఎలాంటి మార్పులు చేయాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం నాటికి ఏపీలో 72,711 కేసులు నమోదు కాగా, 884 మంది మరణించారు. ప్రతీ గంటకు 333 కేసులు నమోదవుతున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: July 24, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading