Home /News /jobs /

BOARD EXAMS PRESSURE ON STUDENTS IN THE WAKE OF BOARD EXAMS CBSE STUDENTS WHO SAY MATHS SCIENCE DIFFICULT SUBJECTS GH VB

Board Exams: బోర్డు పరీక్షల నేపథ్యంలో ఆసక్తికర సర్వే.. ఆ సబ్జెక్ట్ కష్టమే అని చెబుతున్న విద్యార్థులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బోర్డు పరీక్షల నేపథ్యంలో ట్యుటోరియల్ ప్లాట్‌ఫామ్ ఫిలో యాప్ (Filo app) ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

సీబీఎస్‌ఈ బోర్డు(CBSE Board Exams) టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో విద్యార్థులంతా పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్(Preparation), సందేహాలు తదితర అంశాలపై ఇటీవల ట్యుటోరియల్ ప్లాట్‌ఫామ్ ఫిలో యాప్ (Filo app) ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే గణితంలో విద్యార్థులకు ఎక్కువ డౌట్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. గణితంపై దాదాపు 35 శాతం పైగా ప్రశ్నలను సర్వేలో భాగంగా విద్యార్థులను అడిగారు. ముఖ్యంగా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ఇంటిగ్రేషన్(Integration), కాంప్లెక్స్ నంబర్(Complex Number), ప్రాబబిలిటీ తదితర టాఫిక్‌ల్లో విద్యార్థులకు ఎక్కువ సందేహాలు ఉన్నాయి.

గణితం తరువాతి స్థానంలో ఫిజిక్స్ నిలిచింది. ఈ సబ్జెక్ట్ నుంచి సర్వేలో 30శాతం ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో ప్రధానంగా రోటేషనల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెమీకండక్టర్స్, ప్రొజెక్టైల్ మోషన్ సెంటర్ ఆఫ్ మాస్ వంటి టాపిక్స్‌లో విద్యార్థులు తడబడుతున్నారు.

మొత్తం ప్రశ్నల్లో కెమిస్ట్రీ నుంచి 20 శాతం ఉంటాయి. ప్రధానంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ, అయానిక్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ వంటి చాప్టర్లలో విద్యార్థులకు సందేహాలు ఉన్నాయి. హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ వంటి అంశాల నుంచి కేవలం 5 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 10 శాతం సామాజిక శాస్త్రం, ఇంగ్లీషు, ఇతర భాషలు, కంప్యూటర్లకు సంబంధించి ఉంటాయి.

విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కష్టమైన సబ్జెక్టులను ఎలా ఎదుర్కోంటున్నారు ? పరీక్షల్లో అత్యుత్తమ స్కోర్‌ కోసం క్లిష్టమైన అంశాలపై ఎలా దృష్టి సారిస్తున్నారు తదితర అంశాలపై సర్వే చేపట్టారు. పరీక్షలకు సన్నద్ధం అవుతున్నప్పుడు ఒత్తిడి ఎదుర్కొవడానికి విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్‌ల అవసరాన్ని సర్వే నొక్కి చెప్పింది.

IIM Bodh Gaya Courses: మూడు ఎగ్జిక్యూటివ్ కోర్సులను ప్రారంభించిన ఐఐఎం బోధ్ గయా.. పూర్తి వివరాలిలా..


విద్యార్థులు తమ సందేహాలను పరిష్కరించడానికి సగటున వారానికి 4 నుండి 5 గంటలు గడుపుతున్నారని సర్వే పేర్కొంది. టైర్ 2 నగరాల విద్యార్థులు టైర్ 1 నగరాల్లోని వారి ప్రత్యర్ధులతో పోలిస్తే పరీక్షల సన్నద్ధం కోసం యాప్‌లో 20 శాతం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మెట్రో నగరాల్లో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు, ట్యూటర్ల కారణంగా ఈ వ్యత్యాసం ఉండవచ్చని సర్వే పేర్కొంది.

దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు.... చివరి నిమిషంలో సిద్ధం కావడానికి వ్యూహాలు, సమయ నిర్వహణ, ప్రిపరేషన్ ఆందోళనపై చిట్కాలు కోరుతున్నట్లు సర్వేలో తేలింది. 12వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో 30 శాతం మంది విద్యార్థులు కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్, సాఫ్ట్‌వేర్ కోర్సులు, ఉద్యోగావకాశాలు వంటి ప్రశ్నలతో కెరీర్ ఎంపికల గురించి ఆందోళన చెందుతున్నారు. పరీక్షా తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుండడంతో ట్యూటర్లు, మెంటర్ల నుండి మద్దతును ఎక్కువగా కోరుకుంటున్నారు.

విద్యార్థుల స్టడీ అవర్స్‌కు సంబంధించి సర్వేలో కీలక విషయం వెల్లడైంది. ముఖ్యంగా బోర్డు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవారిలో ఎక్కువ మంది సోమవారం చదువుకోవడానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 10 శాతం మంది రోజుకు ఒక గంట స్వీయ-అధ్యయనం కోసం కేటాయిస్తున్నారు. ఇక ఆదివారాల్లో విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. పీక్ లెర్నింగ్ టైమ్ విషయానికి వస్తే, సాయంత్రం 5:30 నుండి 9:30 వరకు విద్యార్థులు స్టడీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాత్రిపూట చురుకుగా ఉండే విద్యార్థులు సాధారణంగా రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య చదువుతుంటారని ఇటీవల ఓ అద్యయనంలో తేలింది.
Published by:Veera Babu
First published:

Tags: Board exams, Career and Courses, CBSE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు