హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS: బీఎండబ్ల్యూ బైక్‌లు, ఇతర ఆఫర్లు.. వాటి కోసం TCS కొత్త ప్రయత్నాలు.. వివరాలిలా..

TCS: బీఎండబ్ల్యూ బైక్‌లు, ఇతర ఆఫర్లు.. వాటి కోసం TCS కొత్త ప్రయత్నాలు.. వివరాలిలా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సాఫ్ట్‌వేర్‌ రంగంలో(Software Industry) స్టార్టప్‌లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. తక్కువ జీతాలకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు భారత్‌లో కొదవలేదు. అందుకే అతి పెద్ద అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌గా ఇండియా నిలిచింది.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో(Software Industry) స్టార్టప్‌లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. తక్కువ జీతాలకు నైపుణ్యం ఉన్న ఉద్యోగులు భారత్‌లో కొదవలేదు. అందుకే అతి పెద్ద అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌గా ఇండియా నిలిచింది. అదే విధంగా నైపుణ్యం ఉన్న వారిని ఆకట్టుకొనేందుకు స్టార్టప్‌లు పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ గ్లోబల్ ఎకానమీకి ఎదురవుతున్న ఏవైనా అంతరాయాలను అధిగమించగలదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. దశాబ్దం చివరినాటికి 50 బిలియన్‌ డాలర్ల అమ్మకాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని, సేవలకు దీర్ఘకాలిక డిమాండ్‌ను సృష్టించగలదని పేర్కొన్నారు.

భారతదేశంలో 227 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌తో టెక్ సేవల పరిశ్రమలో అతిపెద్ద కంపెనీ TCS. ఐరోపా భౌగోళిక రాజకీయాలు, ఉక్రెయిన్‌లో యద్ధం, చైనాలో కరోనా తీవ్రత వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ యూఎస్‌లోని వేలకొద్దీ కంపెనీలకు సాంకేతిక సేవలను, మద్దతును అందిస్తోంది. ఎక్కువగా హైబ్రిడ్ లేబర్ వ్యూహాలను అవలంబిస్తోంది. ఉద్యోగులు ఇంటి నుంచి, ఆఫీస్‌ల నుంచి పని చేస్తున్నారు.

* అవుట్‌సోర్సింగ్‌ పరిశ్రమ అభివృద్ధి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ గోపీనాథన్‌ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..‘దీర్ఘకాలిక డిమాండ్‌ సాధించే వాతావరణం బలంగా ఉంది. అందుకు అనుకూలంగా ఉన్నాం. కచ్చితంగా అభివృద్ధిని సాధిస్తాం’ అని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం కంపెనీలో చేరిన ఆయన తరచూ నీలిరంగు ఫార్మల్ షర్టులు ధరించే మృదుస్వభావి. TCSలో ఎంతో అనుభవం ఉన్న గోపీనాథన్.. క్లయింట్ సంబంధాలను పెంపొందించడంలో మంచి వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.

కంపెనీలు తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా భారతదేశ అవుట్‌సోర్సింగ్‌ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. TCS, Infosys Ltd, Wipro Ltd వంటి సంస్థలు ఖరీదైన సాంకేతిక కార్మికులను భర్తీ చేయడంపై కూడా దృష్టి పెట్టాయి. గోపీనాథన్, అతని సహచరులు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మరింత అధునాతనమైన ఆఫర్‌లను కూడా కల్పిస్తున్నారు. స్టార్టప్‌లు, పెద్ద గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి వ్యాపారాన్ని గెలుచుకునే చర్యలో భాగంగా TCS గత నెలలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. అంతర్గత నిర్మాణాన్ని పునరుద్ధరించింది. ఒక నెల కంటే తక్కువ వ్యవధిలో సిద్ధం చేసినట్లు గోపీనాథన్ చెప్పారు. పునర్వ్యవస్థీకరించే విధానంలో చాలా వేగంగా ఉన్నామని, వినియోగదారుల అవసరాలను తీర్చడంలో సూక్ష్మ దృష్టిని కలిగి ఉన్నామని తెలిపారు.

* ఆసియాలో అగ్రగామి టీసీఎస్‌

TCS ఆసియాలో అగ్రగామి అవుట్‌సోర్సింగ్‌ కంపెనీ. టాటా గ్రూప్‌కు మూలస్తంభం. ఉప్పు నుంచి ఆటోమొబైల్స్ వరకు ప్రతిదానిలో డజన్ల కొద్దీ కంపెనీలతో కూడిన భారతీయ సంస్థ. ఆర్థిక సంవత్సరానికి 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ప్రకటించింది. వర్క్‌ఫోర్స్‌కు చెల్లించే ఖర్చులు పెరగడం ఒక సవాలు. గత వారం TCS నాలుగో త్రైమాసిక లాభం 7.4 శాతం పెరిగి 99.3 బిలియన్ రూపాయలకు చేరింది. విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిభను నియమించుకోవడానికి, నిలుపుకోవడానికి ఖర్చులు పెరిగాయి.

* పోటీ పడుతున్న స్టార్టప్‌లు

స్టార్టప్‌లు తమ వ్యాపారాలను నిర్వహించడానికి అవసరమైన ప్రోగ్రామర్లు, డెవలపర్‌ల కోసం TCS వంటి దిగ్గజాలతో పోటీపడటం ప్రారంభించాయి. కొత్తవారిలో కొందరు BMW మోటార్‌సైకిళ్లు లేదా వారంలో మూడు రోజుల పని వంటి వాటితో ప్రతిభను ఆకర్షిస్తున్నారు. ఈ చర్యలను చాలా పెద్ద ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. TCSలో దాదాపు 600,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023 మార్చి వరకు ఆర్థిక సంవత్సరంలో 40,000 కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్‌లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల కోసం ప్రస్తుత పెనుగులాటను "ట్రాన్సిటరీ"గా గోపీనాథన్ వ్యవహరిస్తున్నారు. TCS కంటే ప్రతిభకు ఎవరూ ఎక్కువ చెల్లించలేరని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, TCS నియామకం, విస్తరణను చేపడుతుందని చెప్పారు.

First published:

Tags: Career and Courses, Full salary, IT Employees, Skills, Software, TCS

ఉత్తమ కథలు