Home /News /jobs /

BLOGGING TO MAKING YOUTUBE VIDEOS THESE ARE 8 BEST IDEAS TO EARN MONEY SS

Job Ideas: రొటీన్ జాబ్ బోర్ కొట్టిందా? ఈ 8 ఐడియాలతో డబ్బు సంపాదించండి

Job Ideas: రొటీన్ జాబ్ బోర్ కొట్టిందా? ఈ 8 ఐడియాలతో డబ్బు సంపాదించండి
(ప్రతీకాత్మక చిత్రం)

Job Ideas: రొటీన్ జాబ్ బోర్ కొట్టిందా? ఈ 8 ఐడియాలతో డబ్బు సంపాదించండి (ప్రతీకాత్మక చిత్రం)

Job Ideas | రొటీన్‌కు భిన్నంగా కొత్త ఐడియాలతో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ 8 ఐడియాస్ ట్రై చేయండి.

    రొటీన్ జాబ్ బోర్ కొడుతోందా? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేయలేకపోతున్నారా? కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? డబ్బు సంపాదించడానికి (Earn Money) చాలా మార్గాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, రొటీన్ జాబ్ కాకుండా కొత్త మార్గాల్లో ఉపాధి పొందాలనుకుంటున్నవారు కొత్త కొత్త ఐడియాల (Job Ideas) గురించి ఇంటర్నెట్‌లో వెతుకున్నారు. మరి మీరు కూడా రొటీన్ జాబ్ వదిలేసి సరికొత్త మార్గంలో ఉపాధి పొందాలనుకుంటే ఈ ఐడియాలతో సులువుగా డబ్బు సంపాదించొచ్చు.

    Blogging: మీకు ఏదైనా రంగంలో నైపుణ్యం ఉందా? ఆ రంగానికి సంబంధించిన అంశాలపై బాగా రాయగలరా? అయితే మీరు ఓ బ్లాగ్ మెయింటైన్ చేయొచ్చు. ఉదాహరణకు మీకు పర్సనల్ ఫైనాన్స్, కుకింగ్ లాంటి అంశాలపై నైపుణ్యం ఉంటే వాటిపై ఆర్టికల్స్ రాయొచ్చు. మంచి ఎస్‌ఈఓతో మీ ఆర్టికల్స్ ప్రమోట్ చేసుకుంటే యాడ్స్ ద్వారా ఆదాయం వస్తుంది.

    Rent Payments: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తే ఎన్నో లాభాలు... అవేంటో తెలుసుకోండి

    YouTube Videos: బ్లాగింగ్ లాగానే యూట్యూబ్ వీడియోల ద్వారా బాగానే ఆదాయం వస్తుంది. వీడియోలు రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం తెలిసుండాలి. అనేక రకాల టాపిక్స్‌పై కాకుండా యూజర్లకు అవసరం అయిన టాపిక్స్‌పై వీడియోలు చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి.

    Stock Market: మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బుతో మరింత ఆదాయం పొందడానికి స్టాక్ మార్కెట్ ఓ మార్గం. మార్కెట్ పరిస్థితులను బట్టి మంచి స్టాక్స్‌లో ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ చేయడం ద్వారా లాభాలు పొందొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్‌తో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

    Tutor: మీకు టీచింగ్ అంటే ఇష్టమా? ఏదైనా సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉందా? అయితే ట్యూటర్‌గా మారొచ్చు. ట్యూషన్స్ చెప్పొచ్చు. పెట్టుబడి అవసరం లేని ఐడియా ఇది. ఆన్‌లైన్ ట్యూటరింగ్ ద్వారా మంచి ఆదాయం వస్తుంది.

    LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి

    eBooks: ఇక మీకు ఆసక్తి ఉన్న టాపిక్‌పై ఇబుక్స్ రాసి డబ్బు సంపాదించొచ్చు. అయితే ఆకట్టుకునేలా రాయడం తెలిసుండాలి.

    Dog walker: మీకు శునకాలంటే ఇష్టమా? అయితే డాగ్ వాకర్‌గా సేవలు అందించొచ్చు. శునకాలను కొంత సమయం పాటు చూసుకోవడమే పని.

    Virtual Assistant: వర్చువల్ అసిస్టెంట్... కొత్తగా పుట్టుకొచ్చిన ఉపాధి మార్గం ఇది. మీరు మీ ఇంట్లోనే ఉంటూ ఇతరులకు వర్చువల్ అసిస్టెంట్‌గా సేవలు అందించొచ్చు. షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేయడం లాంటి సేవలు అందించొచ్చు.

    Babysit: పిల్లలతో ఆడుకోవడం మీకు ఇష్టమా? అయితే మీరు బేబీసిట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు. భార్యాభర్తలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటే తమ పిల్లల్ని చూసుకోవడానికి వీరిని ఏర్పాటు చేసుకుంటారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business Ideas, JOBS

    తదుపరి వార్తలు