బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ సరికొత్త ప్రోగ్రామ్‌ను(New Programme) ప్రారంభించనుంది. కమిన్స్ ఇండియా(India) సహకారంతో ఎంట్రీ-లెవల్(Entry level) అసోసియేట్‌లను శక్తివంతం చేయడానికి అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను లాంచ్ (Launch) చేయనుంది. ప్రొఫెషనల్ డిగ్రీలు(Professional Degree) కలిగిన షాప్ ఫ్లోర్ ఉద్యోగులు(Jobs) తమ కెరీర్(Career) ప్రయాణంలో బలమైన పునాదిని సృష్టించడానికి అవసరమైన శక్తి, నైపుణ్యాలు, పరిశ్రమ పరిజ్ఞానం పొందటానికి ఈ ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రెండు ప్రోగ్రామ్స్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులను తయారీ, ఇంజనీరింగ్(Engineering), కొనుగోలు, నాణ్యత, మార్కెటింగ్(Marketing), సప్లై చైన్(Supply Chain) వంటి కష్టమైన విధుల కోసం ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ కెరీర్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా దేశంలోని అగ్రశ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకదాని నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పొందాలనే వారి కలను నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అలాగే అభ్యర్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి అపారమైన విలువను జోడించేందుకు చర్యలు తీసుకోనుంది.
Moto G22: రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో జీ22 రిలీజ్... ఫీచర్స్ ఇవే
కమ్మిన్స్ ఇండియాకు చెందిన 40 మంది ఉద్యోగుల పైలట్ బ్యాచ్ BTech ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడంతో ఈ భాగస్వామ్యం ఆగస్టు 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 85 మంది ఉద్యోగులతో కూడిన రెండు బ్యాచ్‌లు బీటెక్, ఎంటెక్ డిగ్రీలతో విజయవంతంగా గ్రాడ్యుయేట్ అయ్యారని తయారీ సంస్థ పేర్కొంది. బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) విభాగం అభ్యర్థులకు బోధించడానికి IT & ITES, ఆటోమోటివ్, తయారీ, ఫార్మా, రసాయనాలు, లోహాలు, మైనింగ్ వంటి పరిశ్రమలలో నైపుణ్యాలు కలిగిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష మంది ఉన్నట్లు సమాచారం.
కమిన్స్ ఇండియా హెచ్‌ఆర్ లీడర్ అనుసమ కౌల్ మాట్లాడుతూ.. ‘హైర్ టు డెవలప్’ ఫిలాసఫీకి అనుగుణంగా కమ్మిన్స్‌ను నిజమైన లెర్నింగ్ ఆర్గనైజేషన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి వివిధ మార్గాల్లో నిరంతరం పెట్టుబడులు పెడుతున్నట్లు ఆమె తెలిపారు. అధికారిక విద్యను కొనసాగించడానికి అనువైన ఎంపికలను కలిగి ఉన్న తమ ఉద్యోగుల కోసం స్పాన్సర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో పెట్టుబడి అనేది ఇందులో భాగమన్నారు. తమ ఉద్యోగులకు సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకమైన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల (WILPs) కోసం BITS పిలానీతో చేతులు కలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా తమ ఉద్యోగులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని కమిన్స్ ఇండియా హెచ్‌ఆర్ లీడర్ అనుసమ కౌల్ పేర్కొన్నారు.
BITS పిలానీ ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్స్ & ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. సుందర్ మాట్లాడుతూ ప్రముఖ తయారీ కంపెనీలలో ఒకటైన కమిన్స్ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. BITS Pilani WILP ద్వారా వివిధ రంగాలలోని సంస్థలకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అందుకు సరిపోయే పాఠ్యాంశాలతో ప్రోగ్రామ్‌లను రూపొందించి అందించడానికి నిరంతరం శ్రమిస్తుంటామని ఆయన తెలిపారు. దీంతో వర్కింగ్ నిపుణులను వారి వ్యక్తిగత కెరీర్ మరింత వృద్ధి సాధించడానికి సులభతరం కానుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bits, Career and Courses, EDUCATION, Programs, Technology