Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 171 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BIS Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: September 16, 2020, 12:23 PM IST
Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 171 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 171 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 171 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bis.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

BIS Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 171
అసిస్టెంట్ డైరెక్టర్- 4
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 17
పర్సనల్ అసిస్టెంట్- 16
జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)- 1

లైబ్రరీ అసిస్టెంట్- 1
స్టెనోగ్రాఫర్- 17
సీనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్- 79
జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్- 36

Anganwadi Jobs: రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Flipkart: గుడ్ న్యూస్... 70,000 ఉద్యోగాలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్... ఇంటర్, డిగ్రీ అర్హత

BIS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 26 సాయంత్రం 6 గంటలు
అడ్మిట్ కార్డ్ విడుదల- 2020 అక్టోబర్ 20
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 నవంబర్ 8
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వయస్సు- అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు 35 ఏళ్లు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్లు. ఇతర పోస్టులకు 27 ఏళ్లు.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉద్యోగులకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: September 16, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading