దేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) ఒకటి. బిట్స్ క్యాంపస్‌లు రాజస్థాన్‌లోని పిలానీ, హైదరాబాద్, గోవాల్లో ఉన్నాయి. ఇక్కడ చదివేందుకు యువతీ యువకులు పెద్దసంఖ్యలో పోటీ పడుతుంటారు. 2023 సంవత్సరానికి ఈ క్యాంపస్‌లలో వివిధ డిగ్రీ ప్రోగ్రామ్స్‌కు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (BITSAT) 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. బిట్‌శాట్ 2023కు సంబంధించి పరీక్ష రుసుము, గడువు, పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవాలంటే చదివేయండి.
* దరఖాస్తు గడువు
ఏప్రిల్ 9లోగా BITSAT 2023 కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో రెండు సెషన్లలో ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఒకటో సెషన్ లేదా రెండో సెషన్, లేదంటే రెండు సెషన్లలో కూడా పరీక్ష రాయవచ్చు. సెషన్-1 మే 22తో ప్రారంభమై మే 26తో ముగుస్తుంది. సెషన్-2 జూన్ 18తో మొదలై జూన్ 22తో ముగుస్తుంది. బిట్‌శాట్ పరీక్షను గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంది. వీటిలో ఏ సెషన్లో ఎక్కువ స్కోర్ వస్తే దానినే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు పిలానీ, హైదరాబాద్, గోవాల్లో ఎక్కడైనా అడ్మిషన్ లభిస్తుంది.
* ఫీజు వివరాలు
ఇండియా, ఖాట్మాండ్ కేంద్రాలుగా కేవలం ఒక సెషన్ కోసమే అయితే అబ్బాయిలు రూ.3,400, అమ్మాయిలు అయితే రూ.2,900 ఫీజు చెల్లించాలి. అదే దుబాయ్ సెంటర్ అయితే అన్ని కేటగిరీల వారు రూ.7,000 ఫీజు కట్టాలి. ఇండియా, ఖాట్మండు కేంద్రాలుగా రెండు సెషన్ల కోసం అయితే.. అబ్బాయిలు రూ.5,400, అమ్మాయిలు రూ.4,400 చెల్లించాలి.
దుబాయ్ సెంటర్ అయితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా రూ.9,000 ఫీజు కట్టాలి. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ విధానాల్లోని ఏదైనా రూపంలో చెల్లించవచ్చు. ఒక్కసారి కట్టిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి : యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!
* దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ముందుగా సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.bitsadmission.com లోకి వెళ్లండి. హోమ్ పేజీలో ‘బిట్‌శాట్- 2023’ అనే చోట క్లిక్ చేయండి. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ‘అప్లై ఆన్‌లైన్’ అనే చోట క్లిక్ చేయండి. ‘న్యూ రిజిస్ర్టేషన్’లోకి వెళ్లి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయండి. మీ ఫొటో, సంతకాన్ని జేపీఈజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్‌చేయండి. పరీక్ష ఫీజు కట్టిన తర్వాత సబ్మిట్ చేయండి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. మీ భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తును ఒక ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా దాచుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bits, Career and Courses, EDUCATION, JOBS