హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: నీట్‌లో బెస్ట్ స్కోర్‌కు బయాలజీ కీలకం.. ఈ టిప్స్ పాటించి ఎక్కువ స్కోర్ సాధించండిలా..

NEET 2022: నీట్‌లో బెస్ట్ స్కోర్‌కు బయాలజీ కీలకం.. ఈ టిప్స్ పాటించి ఎక్కువ స్కోర్ సాధించండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెడికల్ ఎంట్రన్స్‌(Medical Entrance)లో మొత్తం 720 మార్కులలో 360 మార్కులకు బయాలజీ(Biology) చాలా కీలకం. ఇందులో పూర్తి మార్కులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. మెడికల్‌ ఎంట్రన్స్‌లో అర్హత సాధించడానికి విద్యార్థికి సరైన ఏకాగ్రత అవసరం. సరైన మార్గంలో సిద్ధం కావాలి.

ఇంకా చదవండి ...

మెడికల్(Medical) ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)-2022 లో అర్హత సాధించి డాక్టర్ కావాలనేది లక్షలాది మంది ఆశావహుల కల. ప్రతి సంవత్సరం దరఖాస్తుదారుల సంఖ్య తో పాటు, పోటీ అనేక రెట్లు పెరిగింది. దరఖాస్తుదారులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే చాలా శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది. మెడికల్ ఎంట్రన్స్‌(Medical Entrance)లో మొత్తం 720 మార్కులలో 360 మార్కులకు బయాలజీ(Biology) చాలా కీలకం. ఇందులో పూర్తి మార్కులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. మెడికల్‌ ఎంట్రన్స్‌లో(Mediacal Entrance) అర్హత సాధించడానికి విద్యార్థికి సరైన ఏకాగ్రత అవసరం. సరైన మార్గంలో సిద్ధం కావాలి.

* ఎగ్జామ్‌ ప్యాటర్న్‌

ప్రశ్నల సంఖ్య, ప్రశ్నల రకం, వెయిటేజీ, మార్కుల ప్రకారం ప్రశ్నల విభజన, ముఖ్యమైన ప్రశ్నలు తదితరాలను తెలుసుకోవడం విద్యార్థులకు అత్యవసరం. పరీక్షా పత్రం పూర్తి అవగాహన కలిగి ఉండటం మేలు చేస్తుంది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది? సమయాన్ని ఎలా విభజించుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. నీట్‌ 2021లో ప్రతి సబ్జెక్ట్‌లో రెండు సెక్షన్‌లు ఉండనున్నాయి. సెక్షన్ B లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉండటం కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అయితే మరోవైపు విద్యార్థులు 180 నిమిషాల్లో 200 ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం సవాలుగా మారింది.

IIT Village : ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఐఐటీ విద్యార్థులే.. క్యూ కడుతున్న ఐఐటీయన్లు.. ఆ వివరాలిలా..


2021వ సంవత్సరంలో బయాలజీ విభాగాన్ని రెండుగా బోటనీ, జువాలజీగా విభజించారు. ఇది గతేడాది ప్రశ్నాపత్రాలకు భిన్నం. సెక్షన్ లో 35 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్ లో 15 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇదే పద్ధతిలో నీట్‌ 2022కి విద్యార్థులు సిద్ధమవ్వాలి. ఈ ప్యాటర్న్‌లోని పరీక్షలు రాయడంతో సమయపాలన, అవగాహన పెరుగుతాయి.

* అన్ని పుస్తకాలపై ఆధారపడకండి

పరీక్షకు సన్నద్ధం అయ్యే సమయంలో చాలా పుస్తకాలపై ఆధారపడటం మంచిది కాదు. ఇది అలసట, గందరగోళాన్ని కూడా కలిగిస్తుంది. విద్యార్థులు తమ శక్తిని, సమయాన్ని తెలివిగా వినియోగించుకోవాలి. NCERT పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రతి మెటీరియల్‌పై ఆధారపడకూడదు. షార్ట్‌ నోట్స్ సిద్ధం చేసుకోవడం ద్వారా రివిజన్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

* ఏదీ సులభంగా రాదు.. కష్టపడి ప్రాక్టీస్ చేయండి

వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం విజయానికి కీలకం. అన్ని అంశాలను చదవడంతోపాటు మాక్‌టెస్టులు రాయడం ద్వారా ప్రిపరేషన్‌లో విశ్వాసం పెరుగుతుంది. గత సంవత్సరం పేపర్లను పరిశీలించి.. నిర్ణీత సమయంలో అన్నింటికి సమాధానాలు గుర్తించడం సాధన చేయాలి. కష్టతరంగా భావించిన విభాగాలపై మరింత దృష్టి పెట్టాలి. కష్టతరంగా భావించిన అంశాలను మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయాలి.

TS TET 2022: టెట్ అభ్యర్థులకు షాకిస్తున్న వెబ్ సైట్.. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ట్విస్టులు.. వివరాలివే

* ముఖ్యమైన అధ్యాయాలు

నీట్‌ బయాలజీ సిలబస్‌లో 38 కంటే ఎక్కువ చాప్టర్స్‌ ఉన్నాయి. మొత్తం ఎగ్జామ్‌ ప్యాటర్న్‌లో 720 మార్కులకు ప్రశ్నలు అడగ్గా.. 360 మార్కులు కేవలం బయాలజీ నుంచి వస్తాయి. ఇందులో మెరుగ్గా రాణించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మేలు. ముందుగా నీట్ 2022 కి సంబంధించిన ముఖ్యమైన అధ్యాయాలను గుర్తించడం కీలకమైన పని. రెండోది ఇతర సబ్జెక్టుల తరహాలోనే బయాలజీకి సమయం కేటాయించడం.

NEET 2021 ప్రశ్నాపత్రం కష్టతరంగా ఉందని, ఎక్కువగా NCERT పుస్తకాల నుంచి ప్రశ్నలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పుస్తకాలను చదవడంతో మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఎక్కువ స్కోర్ పొందవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET 2022, Students

ఉత్తమ కథలు