Home /News /jobs /

BILL TO REPLACE AICTE UGC WITH NEW BODY IN PARLIAMENT THIS MONSOON SESSION UMG GH

AICTE: త్వరలో హైబ్రిడ్ లెర్నింగ్ రెగ్యులేషన్స్.. మార్గదర్శకాలపై AICTE చైర్మన్ స్పందన ఏంటంటే..?

త్వరలో హైబ్రిడ్ లెర్నింగ్ రెగ్యులేషన్స్.. మార్గదర్శకాలపై AICTE  చైర్మన్ స్పందన ఏంటంటే..?

త్వరలో హైబ్రిడ్ లెర్నింగ్ రెగ్యులేషన్స్.. మార్గదర్శకాలపై AICTE చైర్మన్ స్పందన ఏంటంటే..?

ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) త్వరలో హైబ్రిడ్ లెర్నింగ్ నిబంధనలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతవారం బెంగళూరులో కాలేజీ యాజమాన్యాల కోసం నిర్వహించిన హైబ్రిడ్ లెర్నింగ్ వర్క్‌షాప్‌‌‌లో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్దే ఈ వివరాలు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) త్వరలో హైబ్రిడ్ లెర్నింగ్ నిబంధనలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతవారం బెంగళూరులో కాలేజీ యాజమాన్యాల కోసం నిర్వహించిన హైబ్రిడ్ లెర్నింగ్ వర్క్‌షాప్‌‌‌లో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్దే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ట్రైనింగ్ తదితర విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రెండేళ్ల తర్వాత కోర్సు నుంచి నిష్క్రమించే విద్యార్థులకు అదనంగా బ్రిడ్జ్ కోర్సు అందిస్తూ, డిప్లొమా సర్టిఫికేట్ ప్రదానం చేస్తామని అనిల్ సహస్రబుద్దే తెలిపారు. ఇది విద్యార్థుల కోసం మరొక ఎగ్జిట్ ఎంపికగా మారనుంది. ఏఐసీటీఈ కౌన్సిల్.. నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ను ఏర్పాటు చేయనుందని, ఇది భాగస్వామ్య సంస్థలకు బోధనా విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఓ వేదికగా ఉపయోగపడుతుందని సహస్రబుద్దే అన్నట్లు ఓ వార్త సంస్థ నివేదిక పేర్కొంది.

కాలేజీలు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో పాటు కోర్ డిసిప్లీన్స్‌పై కూడా దృష్టిసారించాలని ఏఐసీటీఈ చైర్మన్ చెప్పారు. అన్ని కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)కు ప్రాధాన్యత ఇస్తే మిగతా వాటి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను కోర్ డిసిప్లీన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కోర్ విభాగాలతో పాటు న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్‌లో మైనర్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆయన సూచించినట్లు సదరు వార్త సంస్థ నివేదిక వెల్లడించింది.

ఇదీ చదవండి: హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!


ఈ వర్క్‌షాప్‌లో కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ బి. తిమ్మే గౌడ మాట్లాడుతూ.. ‘‘హైబ్రిడ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టడంలో ఉపాధ్యాయులను విశ్వాసంలోకి తీసుకోవడం సవాల్‌తో కూడుకున్నది. వారు కొంత విముఖత చూపే అవకాశం ఉంది. దాన్ని ముందుగా ఎదుర్కొవాలి.’’ అని పేర్కొన్నారు.

కాగా, కేంద్రప్రభుత్వం 1945లో ఏఐసీటీఈని ప్రారంభించింది. సాంకేతిక విద్యా సౌకర్యాలపై సర్వేలు నిర్వహించడానికి, దేశంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించి, అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ అపెక్స్ అడ్వైజరీ బాడీగా ఏర్పడింది. జాతీయ విద్యా విధానం (1986) ప్రకారం, AICTE అనేది భారతదేశంలోని సాంకేతిక విద్య నిర్వహణతోపాటు నిబంధనలు, ప్రమాణాల ప్రణాళిక, సూత్రీకరణ, నిర్వహణకు చట్టబద్ధమైన అధికారం ఉంది.మరోవైపు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) స్థానంలో ఈ సంవత్సరం నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HECI) ఉనికిలోకి రావచ్చు. ఈ మూడింటి స్థానంలో ఒకే ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది ఏర్పడవచ్చు. హెచ్ఈసీఐ (HECI) ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు దాదాపుగా సిద్ధమైంది. ఇటీవల ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.
Published by:Mahesh
First published:

Tags: Aicte, Bengaluru, Career and Courses, JOBS

తదుపరి వార్తలు