BIHAR MIGRANT WORKERS SON WINS GOLD MEDAL AT IIT ROORKEE US SCHOLARSHIP NK GH
IIT Student: ఐఐటీ విద్యార్థి అరుదైన ఘనత. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ స్కాలర్షిప్కు ఎంపిక
రాహుల్ కుమార్ (image credit - IANS)
IIT Student: ఓ వలస కార్మికుడి కొడుకు... ఐఐటీ రూర్కీలో గోల్డ్ మెడల్ గెలవడమే కాదు... అమెరికా వర్శిటీ స్కాలర్షిప్కి కూడా ఎంపికయ్యాడు. ఇంతకంటే ప్రేరణ మనకు ఏం కావాలి?
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఎన్నోసార్లు నిరూపించారు విజేతలు. అలాంటి విజయాన్నే సాధించాడు బీహార్ (Bihar)కు చెందిన రాహుల్ కుమార్ (22) అనే ఐఐటీ విద్యార్థి. బీహార్ నలందా జిల్లాలోని సోసాండి అనే మారుమూల గ్రామానికి చెందిన రాహుల్ కుమార్... దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) (IIT Roorkee), రూర్కీ నుంచి మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. నిరుపేద కుంటుంబానికి ఆయన తండ్రి సునీల్ సింగ్ (52) రోజువారి కూలీగా సూరత్‌తో విద్యుత్ మగ్గంపై పనిచేస్తారు. మొదట బీహార్‌లో ఉన్న ఆయన కుటుంబం జీవనోపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లింది.
ఐఐటీ రూర్కీలో చదివిన రాహుల్ తన అకడమిక్‌లో ఉన్నతంగా రాణిస్తూ, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు వైపు ఆలోచించేవాడు. సమాజ సేవపై అతనికి ఉన్న ఉత్సాహంతో ఐఐటి రూర్కీ నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు. అంతేకాక, ఐఐటీ రూర్కీలో డిజిటల్ మోడ్ ద్వారా ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశంలో భాగంగా తన సామాజిక కార్యక్రమాలను గుర్తించిన కాలేజీ యాజమాన్యం మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ పేరుతో ఇచ్చే బంగారు పతకంతో ఆయన్ను సత్కరించింది. కాగా, ఈ ఏడాదే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న కుమార్... అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయంలో PHD అడ్మిషన్‌తో పాటు, అదే యూనివర్సిటీ (University of Utah)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధించేందుకు స్కాలర్షిప్ అర్హత కూడా సాధించాడు.
ఉటా యూనివర్సిటీ స్కాలర్షిప్కి ఎంపిక:
రాహుల్ కుమార్ సాధించిన ఘనతపై ఐఐటి రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె చతుర్వేది (Ajit K Chaturvedi) మాట్లాడుతూ “రాహుల్ తన ఉత్తమ లీడర్షిప్, మేనేజ్ స్కిల్స్‌తో సుమారు 1,000 మంది విద్యార్థుల బృందానికి, ప్రభుత్వ అధికారులకి, NGOలకు నాయకత్వం వహించాడు. అంతేకాక, అతను వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. యూత్ లీడర్‌షిప్‌లో రాహుల్ చేసిన కృషికి గాను అనేక అవార్డులు దక్కాయి. కాగా, ఈ ఏడాది జరిగిన కాన్వకేషన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కాన్పొకేషన్కు మా పూర్వ విద్యార్థి అశోక్ సూటాతో పాటు, మా గవర్నర్స్ బోర్డు ఛైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు." అని అన్నారు.
మొత్తానికి రాహుల్... తన ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతూ తనలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తున్నాడు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.