Home /News /jobs /

BIHAR BOY TRAVELS 700 KM IN 24 HOURS TO REACH NEET CENTRE MISSES EXAM BY 10 MINUTES SK

NEET: నీట్ కోసం 700 కి.మీ. ప్రయాణం.. చివరకు పరీక్ష రాయకుండానే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అంత దూరం ప్రయాణించి 10 నిమిషాల వ్యవధిలో పరీక్షకు దూరమయ్యాడు. ఆలస్యమైన కారణంగా అధికారులు అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

    నీట్ పరీక్షలో లోపాలను ప్రభుత్వాలు సరిచేయకపోవడంతో, ఆ ప్రభావం సామాన్య, పేద విద్యార్థులపై పడుతోంది. బీహార్‌లోని దర్భంగాకు చెందిన సంతోష్ కుమార్ యాదవ్ అనే నీట్ అభ్యర్థి, పరీక్ష కోసం 24 గంటల్లో 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కోల్‌కతాకు చేరుకున్నారు. నెలల తరబడి సిద్ధమవుతున్న పరీక్షకు హాజరు కావడానికి రెండు బస్సులు మారాడు. కానీ విధి అతడికి మద్దతు ఇవ్వలేదు. ఆ విద్యార్థి కేవలం 10 నిమిషాల వ్యవధిలో పరీక్షకు దూరమయ్యాడు. పది నిమిషాలు ఆలస్యమైన కారణంగా అధికారులు అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

    "నేను అధికారులను విన్నవించుకున్నాను. నా సమస్యని వివరించాను. కానీ నేను ఆలస్యం అయ్యానని వారు చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమైంది. కేంద్రంలోకి ప్రవేశించడానికి మధ్యాహ్నం 1.30గంటలు కాగా, నేను వెళ్లేసరికి 1.40 గంటలు అయింది” అని యాదవ్ స్థానిక టెలివిజన్ ఛానెల్‌కు చెప్పారు. పరీక్ష కేంద్రాల సమస్య కారణంగా తాను ఒక విద్యా సంవత్సరం కోల్పోయానని చెబుతూ బాధపడ్డాడు ఆ యువకుడు. కోవిడ్ -19 ప్రభావంతో భద్రత, ఆరోగ్య తనిఖీలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష ప్రారంభానికి మూడు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు.

    ముజఫర్‌పూర్ చేరుకోవడానికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దర్భాంగా వద్ద బస్సు ఎక్కానని యాదవ్ చెప్పాడు. అక్కడి నుంచి పాట్నాకు బస్సు ఎక్కాడు. కానీ పాట్నాకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అతడికి ఆరు గంటలు ఆలస్యమైంది. పాట్నా నుంచి కోల్‌కతాకు వెళ్లేందుకు యాదవ్ రాత్రి 9 గంటలకు బస్సు ఎక్కాడు. అర్ధరాత్రి 1.06 గంటలకు సీల్దా స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి టాక్సీలో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. కానీ 10 నిమిషాల వ్యవధిలో పరీక్షకు దూరమయ్యాడు.

    అంతకుముందు సుందర్‌బన్‌లోని గోసాబాకు చెందిన 19 ఏళ్ల దిగంతా మొండల్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. జేఈఈ పరీక్ష రాసేందుకు అతడు సైకిల్‌పై ఆరు గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ తరువాత మరో రెండు గంటలు ప్రజారవాణాలో ప్రయాణించి 75 కిలోమీటర్ల దూరంలోని సాల్ట్ లేక్ సెక్టార్ V పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మదురైకి చెందిన 19 ఏళ్ల బాలిక, తమిళనాడులోని మరో ఇద్దరు నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఈ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరాయి. కరోనా విజృంభిస్తున్న వేళ ఇలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని కార్యకర్తలు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. లాక్డౌన్ పరిమితులు, వరదలు, ప్రజా రవాణా లేకపోవడం వంటి అవరోధాల మధ్య ఈ పరీక్షలు రాయాల్సి వచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, NEET, NEET 2020

    తదుపరి వార్తలు