హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Paper Leak Case: పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్..ప్రవీణ్ తో పాటు పరీక్ష రాసిన ఆ 10 మంది..!

TSPSC Paper Leak Case: పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్..ప్రవీణ్ తో పాటు పరీక్ష రాసిన ఆ 10 మంది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మొత్తం 9 మంది నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మొత్తం 9 మంది నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు కమీషన్ లో పని చేసే ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని తేలగా తాజాగా మరో 10 మంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పరీక్ష రాసిన వారిని కూడా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం.

TSPSC పేపర్ లీక్ కేసులో తొలి వేటు..ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు!

అయితే వీరు కమీషన్ లో పని చేస్తూనే పరీక్ష రాశారా? లేక సెలవులో ఉండి పరీక్ష రాశారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే పరిక్ష రాయడానికి వీరు కమిషన్ నుండి అనుమతి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయిందా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుక ఉన్నారు. విచారణలో భాగంగా రాజశేఖర్ ఫ్రెండ్ సురేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకర్ లక్ష్మిని పోలీసులు విచారిస్తున్నారు.

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ లో కొత్త లింకులు..వాట్సప్ చాట్ ఆధారంగా కూపీ లాగుతున్న సిట్

ఇకపోతే కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అలాగే వారి కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సోదాల్లో పలు ప్రశ్నాపత్రాలు, పెన్ డ్రైవ్ లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నిందితుల ఫోన్ చాట్, వాట్సప్ హిస్టరీ, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.

పేపర్ లీక్ లో తొలి కేసులో అధికారులు వేటు వేశారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC, TSPSC Paper Leak

ఉత్తమ కథలు