హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Paper Leak: బిగ్ ట్విస్ట్..పేపర్ లీకైనట్లు ఆ ఉద్యోగులకు ముందే తెలుసు!

TSPSC Paper Leak: బిగ్ ట్విస్ట్..పేపర్ లీకైనట్లు ఆ ఉద్యోగులకు ముందే తెలుసు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్ 1 పేపర్ లీక్ చేయగా..ఆ విషయం ఇటీవల బయటకు వచ్చిందని..అంతవరకు ఎవరికీ తెలియదని అంతా భావించారు. కానీ సిట్ దర్యాప్తులో దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్,ర్ రమేష్ లను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని..మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీనితో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. కాగా షమీమ్, రమేష్ ల నుండే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు 5 రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనితో ఇవాళ చంచల్ గూడ జైలు నుండి ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.

TSPSC పేపర్ లీక్ కేసులో తొలి వేటు..ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు!

TSPSC పేపర్ లీక్ కేసులోఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్, సురేష్ తో పాటు ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్ లను అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ చేసిన వారి నుంచి ప్రశాంత్ పేపర్ కొనుగోలు చేసి గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ కేసులో తాజాగా మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గండీడ్ కు చెందిన తిరుపతయ్యను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతయ్య రేణుక భర్త డాక్వా నాయక్ నుండి పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది.

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ లో కొత్త లింకులు..వాట్సప్ చాట్ ఆధారంగా కూపీ లాగుతున్న సిట్

ఇప్పటివరకు కమీషన్ లో పని చేసే ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని తేలగా తాజాగా మరో 10 మంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. అయితే వీరు కమీషన్ లో పని చేస్తూనే పరీక్ష రాశారా? లేక సెలవులో ఉండి పరీక్ష రాశారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే పరిక్ష రాయడానికి వీరు కమిషన్ నుండి అనుమతి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయిందా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుకకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

కాగా ఈ కేసులో తవ్విన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో నేటి సిట్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

First published:

Tags: Crime, JOBS, Telangana, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు