Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్... 12,200 మంది తొలగింపు

Infosys | ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలను ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.

news18-telugu
Updated: November 5, 2019, 6:50 PM IST
Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్... 12,200 మంది తొలగింపు
Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్... 12,200 మంది తొలగింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్... తమ ఉద్యోగులకు షాకిచ్చింది. భారీగా ఉద్యోగాలకు కోత విధించబోతోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్స్‌తో పాటు మిడిల్ బ్యాండ్స్‌లో పనిచేసే ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తు చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. అసోసియేట్, మిడ్ లెవెల్ పొజిషన్‌లో 10,000 మంది, మిడిల్, టాప్ లెవెల్ పొజిషన్‌లో 2,200 మంది ఉద్యోగుల్ని తొలగించనుందన్న వార్తలొస్తున్నాయి. అంటే మొత్తం 12,200 ఉద్యోగాల కోత పడనుంది. సీనియర్ ఎగ్జిక్యూటీవ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్లను 50 మందిని తొలగించనుందని అంచనా.

ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. కాగ్నిజెంట్ 7,000 ఉద్యోగులను తొలగించనుంది. దాంతోపాటు సంస్థ వ్యూహాత్మక పునర్నిర్మాణం కూడా మరో 6,000 ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. బీటెక్, ఎంటెక్ లాంటి కంప్యూటర్ కోర్సులు చేసినవారికి ఒకప్పుడు డ్రీమ్ కంపెనీలుగా ఉన్న కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు... ఇలా ఉద్యోగులను తొలగిస్తుండటం నిరుద్యోగుల్లో కలవరం రేపుతోంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IBPS SO 2019: డిగ్రీ అర్హతతో 1163 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి విద్యార్హతలు, వేతనాల వివరాలివే

Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: November 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు