ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్... తమ ఉద్యోగులకు షాకిచ్చింది. భారీగా ఉద్యోగాలకు కోత విధించబోతోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్స్‌తో పాటు మిడిల్ బ్యాండ్స్‌లో పనిచేసే ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తు చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. అసోసియేట్, మిడ్ లెవెల్ పొజిషన్లో 10,000 మంది, మిడిల్, టాప్ లెవెల్ పొజిషన్లో 2,200 మంది ఉద్యోగుల్ని తొలగించనుందన్న వార్తలొస్తున్నాయి. అంటే మొత్తం 12,200 ఉద్యోగాల కోత పడనుంది. సీనియర్ ఎగ్జిక్యూటీవ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్లను 50 మందిని తొలగించనుందని అంచనా.
ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. కాగ్నిజెంట్ 7,000 ఉద్యోగులను తొలగించనుంది. దాంతోపాటు సంస్థ వ్యూహాత్మక పునర్నిర్మాణం కూడా మరో 6,000 ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. బీటెక్, ఎంటెక్ లాంటి కంప్యూటర్ కోర్సులు చేసినవారికి ఒకప్పుడు డ్రీమ్ కంపెనీలుగా ఉన్న కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు... ఇలా ఉద్యోగులను తొలగిస్తుండటం నిరుద్యోగుల్లో కలవరం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.