హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Shock to Employees: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ షాక్.. నిరసనలకు సిద్ధమయ్యే యోచనలో సిబ్బంది..

Shock to Employees: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ షాక్.. నిరసనలకు సిద్ధమయ్యే యోచనలో సిబ్బంది..

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి షాక్

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి షాక్

Shock to Employees: ప్రభుత్వ ఉద్యోగమనే ఆశతో చాలామంది గ్రామ, వార్డు సచివాలయలో పని చేసేందుకు ఆసక్తి చూపించారు.. పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలు సంపాదించారు. అయితే వారికి రోజు రోజుకూ సర్కార్ పని భారం పెంచుతూ వస్తోంది.. కానీ వారికి ఇచ్చిన హామీ మాత్రం పూర్తి చేయడం లేదు.. ఇప్పుడు మరో షాక్ ఇవ్వడంతో.. ఉద్యోగులు ఆందోళన బాట పట్టే యోచనలో ఉన్నారని సమాచారం.

ఇంకా చదవండి ...

Shock to Employees: సర్కారు కొలువంటే ఎవరికి ఇష్టం ఉండదు. అదే ఆశతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో (ap grama ward sachivalayam Jobs) భారీగా చేరారు యువత. మంచి క్వాలిఫికేషన్ ఉన్నవారు సైతం ప్రభుత్వం ఉద్యోగం అనే ఆశతో ప్రైవేటు జాబ్ లు వదిలి ఇక్కడ చేరారు. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ (AP Government) మరో షాకిచ్చింది. ఉద్యోగాలు పర్మినెంట్ చేసే విషయంలో కాలయాపన చేస్తూ వస్తోంది. ఇటీవల ఉద్యోగుల ఆందోళనలతో జూన్‌ నెలాఖరు నాటికి పర్మినెంట్‌ చేస్తామని స్వయంగా సీఎం జగన్ (CM Jagan) ప్రకటించారు.. దీంతో హమ్మయ్య అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. దాదాపు సగం మందిని మాత్రమే పర్మినెంట్‌ చేస్తారన్న సమాచారం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ, ఆందోళన కలిగిస్తోంది. పలు కారణాలు చూపి దాదాపు 60 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్‌ (job permanent) చేయకుండా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు సమాచారం. తమ ఉద్యోగ భద్రతపై వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 56 వేలమందిని పర్మినెంట్‌ చేసే అవకాశాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 56 వేల మందిని కూడా ఎప్పుడు పర్మినెట్ చేస్తారన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. మొత్తం 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. వాస్తవంగా చూస్తే 1.17 లక్షల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మిగిలిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల్లో చేరిన వారిని అప్రెంటిషిప్‌ పేరుతో తక్కువ జీతాలతో రెండేళ్లు పనిచేయించుకుంది. ఆ తర్వాత పర్మినెంట్‌ చేయకుండా వాయిదా వేస్తూ వస్తోంది. పైగా డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసయితేనంటూ జగన్‌ సర్కారు మెలిక పెట్టింది. పర్మినెంట్‌ చేయకుండా 9 నెలలు వాయిదా వేసింది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కోసం డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహించాలానే రూల్ ఉంది. ఆ పరీక్షల్లో పాసయితే పదోన్నతి కల్పించే పద్ధతి ప్రభుత్వ నియామకాల్లో ఉంటుంది. అయితే ఆ రూల్స్ ఏవీ ఇక్కడ పాటించడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటించాలంటే డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ పాసవ్వాలని నిబంధనలు పెట్టారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులందరికీ ఒకేసారి డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లు నిర్వహించలేదు. కొంత మందికి టెస్ట్‌ పెట్టినా ఫలితాలు ప్రకటించలేదు. కొంత మందికి ఇప్పటికీ టెస్ట్‌ నిర్వహించలేదు. 14 వేలమంది మహిళా పోలీసులకు సంబందించి ఏడాది క్రితం డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ నిర్వహించారు. వివిధ కారణాలతో ఫలితాలు వెల్లడించలేదు. దీంతో వారందరికీ ఇప్పట్లో పర్మినెంట్‌ అయ్యే పరిస్థితి లేదు. ఎనర్జీ అసిస్టెంట్లకు అసలు డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లు నిర్వహించకపోవడంతో వారికి కూడా పర్మినెంట్‌ అయ్యే పరిస్థితి లేదు.

15 రోజుల కంటే ఎక్కువ క్యాజువల్‌ లీవ్‌లు వాడుకున్న కార్యదర్శులకు, షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారికి, మెటర్నిటీ లీవ్‌లో ఉన్న సిబ్బందికి, అనారోగ్యంతో సెలవులో ఉన్న వారికి ప్రస్తుతం పర్మినెంట్‌ చేయడం లేదు. పలువురు కార్యదర్శులు మెడికల్‌ లీవ్‌ పెట్టి సెలవులో ఉన్నారు. వారిని పర్మినెంట్‌ చేయడం లేదని చెబుతున్నారు. కొంత మంది టార్గెట్లు పూర్తి చేయలేదనో, ఇతర కారణాలతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానాలు ఇచ్చినా ఇంకా ఆ విషయాన్ని పెండింగ్ లోనే పెట్టారు. కొంత మంది మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవ్‌లో ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు పర్మినెంట్‌ చేయడం లేదు. అనారోగ్యం కారణంగా కొంత మంది ఎక్కువ సెలవులు పెట్టి ఉంటే వారిని కూడా పర్మినెంట్‌ చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పోలీసు వెరిఫికేషన్‌ ఇంకా పూర్తి కాలేదు. అలాంటి వారికి కూడా నిలిపేయనున్నారు.

పర్మినెంట్‌ చేయాలన్న డిమాండ్‌ పెరగడంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 10 శాతం కూడా పాస్‌ కానీయకుండా అడ్డుకుందని ఆరోపిస్తున్నారు. డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తమను డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ల్లో ఫెయిల్‌ చేయడమేంటని వారు నిలదీస్తున్నారు. ఇంటర్‌ అర్హత కలిగిన ఉద్యోగాలకు డిగ్రీ అర్హతలు పెట్టి, డీఎస్సీ స్థాయిలో పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టారని పేర్కొంటున్నారు. ఉద్యోగాల్లో చేరేందుకు పరీక్షలు పాసయిన తమకు రెగ్యులర్‌ అయ్యేందుకు అర్హత లేదా? అంటూ నిలదీస్తున్నారు. ప్రతి పరీక్షలకు కీ విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లకు మాత్రమే కీ విడుదల చేయడం వెనుక దురుద్దేశం ఉందంటున్నారు. టెస్ట్‌లు పాస్‌ కాలేదనే కారణంతో రెగ్యులర్‌ చేయకుండా నిలిపేసేందుకే సర్కార్‌ ఈ పన్నాగం పన్నిందని వాపోతున్నారు.

ముఖ్యమంత్రి తన మానస పుత్రికగా చెప్పుకొనే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో పనిచేస్తున్న కార్యదర్శులు ప్రస్తుతం సర్కార్ వైఖరితో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేసింది. ఉద్యోగాల్లో చేరినవారికి సుదీర్ఘకాలం జాబ్‌చార్ట్‌ రూపొందించలేకపోయింది. అప్రెంటిషిప్‌ పేరుతో రెండేళ్ల పాటు కేవలం 15 వేలు గౌరవ వేతనం అందించింది. ఆ తర్వాత ప్రొబేషన్‌ ప్రకటించకుండా జూన్‌కు వాయిదా వేసింది. ప్రభుత్వ విధానాలతో విసిగిన కొందరు మరో ఉద్యోగం రావడంతో రిజైన్‌ చేస్తున్నారు. అయితే అలాంటి వారంతా అప్రెంటిషిప్‌ కాలంలో తీసుకున్న గౌరవవేతనం తిరిగి ఇవ్వాలన్న నిబంధనలు పెట్డడం మరో వివాదం అవుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap grama sachivalayam, AP News

ఉత్తమ కథలు