• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • BIG GOOD NEWS TO ALL CENTRAL GOVERNMENT EMPLOYEES ABOUT NPS TIER II ACCOUNT CAN BE OPERATED WITHOUT CHECKBOOK HSN GH

NPS Tier II Account: మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌పిఎస్ చందాదారులకు పండగలాంటి వార్త..!

NPS Tier II Account: మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌పిఎస్ చందాదారులకు పండగలాంటి వార్త..!

ప్రతీకాత్మక చిత్రం

అంతకుముందు ఎన్‌పీఎస్‌ టైర్- II ఖాతాదారులకు లాక్-ఇన్ పీరియ‌డ్(Lock In Period) ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం మూడేళ్లపాటు లాక్‌-ఇన్ పీరియ‌డ్ విధిస్తూ పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అంతేకాక, NPS టైర్ I ఖాతాదారుడికి 60 ఏళ్లు వచ్చే వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉందని స్పష్టం చేసింది.

  • Share this:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) సబ్స్క్రైబర్స్ ఇకపై ఆన్లైన్ విధానంలో కూడా స్కీం నుండి ఎగ్జిట్ కావొచ్చని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా మరో అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఖాతాదారులకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై ఎన్‌పిఎస్ టైర్ II ఖాతాదారులు చెక్ బుక్(Cheque Book) లేకుండానే ఖాతాను నిర్వహించవచ్చు. తద్వారా, పెట్టుబడిదారులు (Investors) ఇకపై బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్(Savings Account)కు ప్రత్యామ్నాయంగా ఎన్‌పిఎస్ టైర్ II ఖాతా(NPS Tier II Account) ను నిర్వహించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా వలే ఎన్‌పిఎస్ టైర్ II కూడా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. అయితే, అంతకుముందు ఎన్‌పీఎస్‌ టైర్- II ఖాతాదారులకు లాక్-ఇన్ పీరియ‌డ్(Lock In Period) ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం మూడేళ్లపాటు లాక్‌-ఇన్ పీరియ‌డ్ విధిస్తూ పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అంతేకాక, NPS టైర్ I ఖాతాదారుడికి 60 ఏళ్లు వచ్చే వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉందని స్పష్టం చేసింది. అయితే, పెట్టుబడిదారులు ఎన్‌పిఎస్ టైర్ I ఖాతా(NPS Tier I) లేకుండా ఎన్‌పిఎస్ టైర్ II ఖాతాను మాత్రం తెరవలేరని పేర్కింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పన్ను ప్రయోజనాలు..
కాగా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్ -2 ఖాతాదారులకు సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Central Government Employee) మాత్రమే ఈ ఆదాయపు పన్ను ప్రయోజనాలు(Taxation Benefits) పొందడానికి అర్హులు. వారికి సెక్షన్ 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అర్హత ఉంటుంది. ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెట్టుబ‌డుల‌పై ఎటువంటి ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌దు. అంతేకాక, వారికి ఎటువంటి లాక్‌-ఇన్ పీరియ‌డ్ కూడా ఉండ‌దు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.

ఈ మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్లో పెట్టుబడి ఉపసంహరణకు ఎటువంటి అనుమతి ఉండ‌దు. అయితే, చందాదారుడు మ‌ర‌ణిస్తే మాత్రం పెట్టుబడి మొత్తాన్ని నామినీ / చట్టపరమైన వారసుడు ఉపసంహరించుకోవచ్చు. కాగా, ఎన్‌పిఎస్ టైర్ II ఖాతాదారులు ఎస్‌బిఐ(SBI), యుటిఐ(UTI), ఎల్‌ఐసి(LIC), హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, కోటక్, రిలయన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ ఫండ్‌తో సహా ఎనిమిది మంది ఫండ్ మేనేజర్(Fund Manager)లను ఎంచుకోవచ్చు. ఎన్‌పిఎస్ టైర్ 2 ఖాతాకు కనీస బ్యాలెన్స్ అవసరం లేదా కనీస వార్షిక సహకారం అవసరం లేదు.
Published by:Hasaan Kandula
First published: