AP Inter Admissions 2020: ఏపీలో నేటి నుంచే ఆన్‌లైన్ లో ఇంటర్ ప్రవేశాలు.. ఈ లింక్ తో దరఖాస్తు చేసుకోండి

AP Inter Admissions 2020: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఇంటర్ ప్రవేశాలను చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

news18-telugu
Updated: October 21, 2020, 12:28 PM IST
AP Inter Admissions 2020: ఏపీలో నేటి నుంచే ఆన్‌లైన్ లో ఇంటర్ ప్రవేశాలు.. ఈ లింక్ తో దరఖాస్తు చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇంటర్ లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఇంటర్ ప్రవేశాలను చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు తొలిసారిగా ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. 2020-21 సంవత్సరానికి గాను విద్యార్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21(ఈ రోజు) నుంచి ఏపీలో రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

AP Inter Admissions 2020-Direct Link

ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాల ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 29న తేదీ సాయంత్రం 5 గంటల లోగా విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా.. ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ. 200, ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందిన విద్యార్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఎదురైతే 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

ఎలాంటి సర్టిఫికేట్లు అవసరం లేదు..
ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా విద్యార్థులు అడ్మిషన్ కోసం కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఎవరైనా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే సమీపంలో ఉన్న వార్డు లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకోవడానికి టెన్త్ హాల్ టికెట్ నంబర్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్లు మాత్రమే అవసరం ఉంటుంది. వాస్తవానికి ఈ అడ్మిషన్ల ప్రక్రియను సెప్టెంబర్ లోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే అనివార్య కారణాలతో వాయిదా వేశారు. అడ్మిషన్లను విద్యార్థుల ఇంటర్ మార్కుల ఆధారంగా చేపట్టనున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 12:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading