హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

మేము అధికారంలోకి వస్తే...భారత టెకీలకు గుడ్‌న్యూస్ చెప్పిన డెమోక్రటిక్ పార్టీ

మేము అధికారంలోకి వస్తే...భారత టెకీలకు గుడ్‌న్యూస్ చెప్పిన డెమోక్రటిక్ పార్టీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

H1B Visa: హెచ్1బీ వీసాలపై ట్రంప్ యంత్రాంగం ఆంక్షలను తప్పుబట్టిన డెమోక్రటిక్ పార్టీ...తాము అధికారంలోకి వస్తే దీన్ని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న ఐటీ నిపుణులకు ఇది ఊరట కలిగించే అంశం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అమెరికాలోని ప్రవాస భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్‌ పేరును ఖరారు చేసింది. అయితే భారతీయుల మద్ధతు భారత సంతతికి చెందిన కమలా హారిస్ కంటే తనకే ఎక్కువ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో భారతీయులకు డెమోక్రటిక్ పార్టీ మరో ఎన్నికల హామీ ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే...హెచ్1బీ వీసాలను ప్రక్షాళన చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే గ్రీన్ కార్డులకు దేశాల వారీగా అమలవుతున్న కోటాను రద్దు చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చింది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా...భారతీయ అమెరికన్లను దృష్టిలో ఉంచుకుని బిడెన్ ప్రచార బృందం ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం.

కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సహం కల్పించనున్నట్లు ఆ ప్రత్యేక విధాన పత్రంలో తెలిపింది. హెచ్1బీ వీసాలతో పాటు ఇతర వలస వీసాలపై ట్రంప్ యంత్రాంగం పలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో దీన్ని తప్పుబడుతూ డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రకటన చేసింది. హెచ్1బీ వీసాలపై ఆంక్షలు అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న ఐటీ, టెక్ నిపుణుల పాలిట శాపంగా మారింది. అటు ఫెడరల్ ఏజెన్సీల్లో తాత్కాలిక ఉద్యోగాల్లో కూడా హెచ్1బీ వీసాదారులను ఉద్యోగాల్లోకి తీసుకొవద్దంటూ ట్రంప్ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్  జారీ చేశారు. దీంతో సదరు వీసాలపై అమెరికాలో ఉంటున్న నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

First published:

Tags: H1B Visa, Joe Biden, US Elections 2020

ఉత్తమ కథలు