హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 80 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 80 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్(BHEL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,

ఇంకా చదవండి ...

  భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సంస్థ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను(10 Vacancies) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. యంగ్ ప్రొఫెషనల్(Young Professionals) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఢిల్లీలోని సంస్థ కార్పొరేట్ ఆఫీస్( BHEL’s Corporate Office, New Delhi) లోని కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ గ్రూప్ లో ఈ ఖాళీలను(Jobs) భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుది. పని తీరు ఆధారంగా మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

  -ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మేనేజ్మెంట్ లో రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సు చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

  -ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

  -అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  -అభ్యర్థులకు నవంబర్ 1, 2021 నాటికి కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  AP Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ, పీజీ చేసిన వారికి నేడు జాబ్ మేళా.. ఏడాదికి రూ.2.60 లక్షల వేతనం

  ఎలా అప్లై చేయాలంటే..

  Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా http://www.careers.bhel.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం Current Openings విభాగంలో Engagement of young professionals in BHEL ఆప్షన్ ను ఎంచుకోవాలి.

  Step 3: Apply Online ఆప్షన్ ను ఎంచుకోవాలి.

  Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అర్హతలివే

  Step 4: తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ (BHEL Application Form) ఓపెన్ అవుతుంది. సూచించిన వివరాలను నమోదు చేయాలి.

  Step 5: అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

  -నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  -అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: BHEL, Career and Courses, Central Government Jobs, Govt Jobs 2021, Job notification

  ఉత్తమ కథలు