BHEL RECRUITMENT 2021 FOR ENGINEERS APPLICATIONS INVITING FOR 16 VACANCIES SALARY UP TO RS 71040 NS
BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 70 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BHEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్, డిప్లొమా చేసిన వారు ఈ కాళీలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా మొత్తం 16 ఖాళీలను (Job Vacancies) భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంజనీర్-సివిల్ (Engineer - Civil) విభాగంలో 8 ఖాళీలు, సూపర్ వైజర్-సివిల్ (Supervisor(FTA-Civil) ) విభాగంలో మరో 8 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ (https://careers.bhel.in/bhel/jsp/) ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (Notification) తెలిపారు. అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం నోటిఫికేషన్ కింద అప్లికేషన్ ఫామ్ లింక్ కనిపిస్తుంది. Step 3:ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. Step 4:అప్లికేషన్ ఫామ్ లో వివరాలను పూర్తిగా నింపాలి. Step 5.అప్లికేషన్ ఫామ్ ను Sr. Deputy General Manager (HR), BHEL, Power Sector Western Region, Shree Mohini Comples, 345 Kingsway, Nagpur 440001 చిరునామాకు పంపించాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.