• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • BHEL RECRUITMENT 2020 21 BHARAT HEAVY ELECTRICALS LIMITED RELEASED NOTIFICATION FOR YOUNG PROFESSIONAL POSTS SS

BHEL Jobs 2020: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BHEL Jobs 2020: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BHEL Jobs 2020: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

BHEL Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు ఖాళీల భర్తీకి బీహెచ్ఈఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, కార్పొరేట్ హెచ్ఆర్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 7 ఖాళీలను ప్రకటించింది బీహెచ్ఈఎల్. న్యూఢిల్లీలోని బీహెచ్ఈఎల్ కార్పొరేట్ ఆఫీసులో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇవి ఏడాది గడువు ఉన్న తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మూడేళ్ల వరకు పొడిగించొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.bhel.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://careers.bhel.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

    BHEL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 7
    యంగ్ ప్రొఫెషనల్ (కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజ్‌మెంట్)- 5
    యంగ్ ప్రొఫెషనల్ (కార్పొరేట్ ఫైనాన్స్)- 1
    యంగ్ ప్రొఫెషనల్ (కార్పొరేట్ హెచ్ఆర్)- 1

    TASK Registration: కొత్త స్కిల్స్ నేర్చుకోవాలా? టాస్క్ రిజిస్ట్రేషన్ త్వరలో ముగుస్తోంది

    AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రూ.1,00,000 పైగా జీతం

    BHEL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


    దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 9
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 31
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
    విద్యార్హతలు- సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా
    అనుభవం- రెండేళ్లు
    వయస్సు- 2020 డిసెంబర్ 1 నాటికి 30 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
    వేతనం- రూ.80,000

    Railway Jobs 2021: రైల్వేలో 1004 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    NBCC Recruitment 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 100 జాబ్స్... బీటెక్ పాసైతే చాలు

    BHEL Recruitment 2020: అప్లై చేయండి ఇలా


    నోటిఫికేషన్ చదివిన తర్వాత విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://careers.bhel.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో Engagement of Young Professionals in BHEL లింక్ పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply Online for Young Professionals పైన క్లిక్ చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: