హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BHEL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బీహెచ్‌ఈఎల్‌లో లక్షకు పైగా వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

BHEL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బీహెచ్‌ఈఎల్‌లో లక్షకు పైగా వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (BHEL Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీహెచ్‌ఈఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.  ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తంగా 150 ఖాళీ పోస్టులను (Jobs) భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్, మెకానికల్, ఐటీ, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో అన్ని పోస్టులకు నెలకు రూ.50,000 జీతం లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థులకు రూ. 60,000 - రూ.1,80,000 స్కేల్ పే లభిస్తుంది. ఇందులో బేసిక్ పే రూ. 60,000 వరకు ఉంటుంది.

  విద్యార్హతల వివరాలు:

  - ఇంజనీర్ ట్రైనీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ తప్పనిసరిగా చేసి ఉండాలి.

  - ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూషన్ నుంచి క్వాలిఫైడ్ చార్టర్డ్ లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

  AAI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు .. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

  - హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అన్ని సంవత్సరాల్లో మొత్తంగా కనీసం 60 శాతం మార్కులతో పుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

  - అన్ని సంవత్సరాలు/సెమిస్టర్లలో మొత్తంగా కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల పుల్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేయడం కూడా తప్పనిసరి.

  Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 1535 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

  వయోపరిమితి:

  అన్ని విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా ఉంది. ఇంజనీరింగ్ లేదా బిజినెస్‌లో అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలు. కాగా, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 29లోపు ఉండాలి.

  ఎంపిక ప్రక్రియ

  - దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.

  - ఆ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

  - అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులు, అవసరాల ఆధారంగా ఈ షార్ట్‌లిస్ట్ విధానం ఉండనుంది.

  - రాత పరీక్షకు 75 శాతం, ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీ ఇస్తూ తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

  దరఖాస్తు ప్రక్రియ:

  -ముందు బీహెచ్ఈఎల్ అధికారిక వెబ్‌సైట్ https://careers.bhel.in/bhel/jsp/ లో కెరీర్స్ పేజీ‌ ఓపెన్ చేసి.. రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఇంజనీర్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్-2022‌ ట్యాబ్‌ను సెలక్ట్ చేయాలి.

  -ఇక్కడ ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అవసరమైన వివరాలతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌ నింపాలి.

  -అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించి, సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను సేవ్ చేసుకోండి.

  దరఖాస్తు ఫీజు:

  అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు, రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు కేవలం ప్రాసెసింగ్‌ ఫీజు రూ.300, ప్లస్ జీఎస్టీ మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: BHEL, Central Government Jobs, JOBS

  ఉత్తమ కథలు