నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 389 ఖాళీలున్నాయి. తిరుచ్చిరాపల్లిలోని బీహెచ్ఈఎల్ యూనిట్లో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://trichy.bhel.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 389
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 66
మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 44
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 2
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 7
సివిల్ ఇంజనీరింగ్- 6
కెమికల్ ఇంజనీరింగ్- 1
Changing Job: ఉద్యోగం మారుతున్నారా? అయితే ఈ విషయాలు మర్చిపోవద్దు
NTA Recruitment 2021: మొత్తం 1145 పోస్టుల భర్తీకి మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ట్రేడ్ అప్రెంటీస్- 253
ఫిట్టర్- 115
వెల్డర్- 58
టర్నర్- 7
మెషినిస్ట్- 12
ఎలక్ట్రీషియన్- 26
వైర్‌మెన్- 2
ఎలక్ట్రానిక్ మెకానిక్- 2
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 2
ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్- 2
డీజిల్ మెకానిక్- 3
ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 8
కార్పెంటర్- 2
ప్లంబర్- 2
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8
అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్సెస్)- 2
అకౌంటెంట్- 4
ఎంఎల్టీ ప్యాథాలజీ- 1
టెక్నీషియన్ అప్రెంటీస్- 70
మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 49
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 8
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 5
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
సివిల్ ఇంజనీరింగ్- 6
IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు
Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2021 ఏప్రిల్ 21
విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
విదేశాలను తలపించే టోర్నడోలు (సుడిగాలి) .. వీడియో చూడండి
అభ్యర్థులు ముందుగా https://trichy.bhel.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Apprenticeship Application Portal (TRICHY) లింక్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Register పైన క్లిక్ చేయాలి.
ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి I agree పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి REGISTER పైన క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, బ్యాంక్ పాస్‌బుక్ ఫ్రంట్ పేజీ, ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ కాపీ సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BHEL, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION