BHARTIYA PASHUPALAN NIGAM LIMITED BPNL HAS INVITED ONLINE APPLICATIONS FOR THE RECRUITMENT OF 3216 VACANCIES FOR VARIOUS POSTS NS
BPNL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారతీయ పశుపాలన్ లిమిటెడ్లో 3216 ఉద్యోగాలు
ప్రతీకాత్మక చిత్రం
కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్లు వస్తున్నాయి.
కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్లు వస్తున్నాయి. దీంతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్ లో మునిగిపోయారు. తాజాగా భారతీయ పశుపాలన్ నిగామ్ లిమిటెడ్(BPNL) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 3216 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెన్త్, డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీలు, అర్హతల వివరాలు:మొత్తం మూడు విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సేల్స్ మేనేజర్ విభాగంలో 64, సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్ విభాగంలో 485, సేల్స్ హెల్పర్ విభాగంలో 2667 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్: ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
సేల్స్ ఆఫీసర్:ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. Official Website-Direct Link
సేల్స్ మేనేజర్:పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 25-45 ఏళ్ల మధ్యలో ఉండాలి. సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ హెల్పెర్ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.