Jobs: నిరుద్యోగులకు బీఎస్ఎన్ఎల్ షాక్... జాబ్ నోటిఫికేషన్ రద్దు

BSNL JTO Notification | అభ్యర్థులు ఎగ్జామ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా షాకిచ్చింది బీఎస్ఎన్ఎల్. నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

news18-telugu
Updated: September 6, 2019, 9:54 AM IST
Jobs: నిరుద్యోగులకు బీఎస్ఎన్ఎల్ షాక్... జాబ్ నోటిఫికేషన్ రద్దు
Jobs: నిరుద్యోగులకు బీఎస్ఎన్ఎల్ షాక్... జాబ్ నోటిఫికేషన్ రద్దు
news18-telugu
Updated: September 6, 2019, 9:54 AM IST
జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో జారీ చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL రద్దు చేసింది. పరిపాలనపరమైన కారణాల వల్ల జూనియర్ టెలికామ్ ఆఫీసర్ (సివిల్ & ఎలక్ట్రికల్) నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో 198 జూనియర్ టెలికామ్ ఆఫీసర్-JTO పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎన్ఎల్. గేట్ 2019 స్కోర్ ఆధారంగా పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. జనరల్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి మరీ దరఖాస్తు చేశారు. అందరూ ఎగ్జామ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా షాకిచ్చింది బీఎస్ఎన్ఎల్. నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Bharat Sanchar Nigam Limited jobs, BSNL jobs, BSNL Junior Telecom Officer notification, BSNL JTO notification, BSNL cancelled  JTO notification, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాలు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు, బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ నోటిఫికేషన్, బీఎస్ఎన్ఎల్ జేటీఓ నోటిఫికేషన్, బీఎస్ఎన్ఎల్ జేటీఓ నోటిఫికేషన్ రద్దు
Source: BSNL


కొంతకాలంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లతో పోటీపడలేక నానా తిప్పలు పడుతోంది ఈ ప్రభుత్వ రంగ టెలికామ్ కంపెనీ. రూ.15,000 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. అందుకే 80,000 మందికి పైగా ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఉన్న ఉద్యోగులనే తొలగించే పరిస్థితి ఉండటంతో కొత్తవారిని నియమించే అవకాశాలు లేవు. దీంతో ఫిబ్రవరిలో జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్‌ను ఏడు నెలల తర్వాత రద్దు చేసింది బీఎస్ఎన్ఎల్.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
High Court Jobs: హైకోర్టులో 1539 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Jobs: ఐరెల్‌‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 252 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...