BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

BHEL Recruitment 2019 | డిసెంబర్ 9న ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://edn.bhel.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: December 6, 2019, 3:28 PM IST
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజనీరింగ్), టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బెంగళూరులోని బీహెచ్ఈఎల్ ఎలక్ట్రానిక్ డివిజన్ ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 56 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు నేఅవసరమైన డాక్యుమెంట్స్‌తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. డిసెంబర్ 9న ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://edn.bhel.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

BHEL Recruitment 2019: వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే



మొత్తం ఖాళీలు- 56
టెక్నీషియన్ అప్రెంటీస్ (డిప్లొమా)- 51
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజనీరింగ్)- 5
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు రూ.8000.వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ- 2019 డిసెంబర్ 9 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.3 గంటల నుంచి 3.30 గంటల వరకు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరిగే స్థలం:
BHARAT HEAVY ELECTRICALS LIMITED,
ELECTRONICS DIVISION,
MYSORE ROAD, BENGALURU - 560026
దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

HAL Recruitment 2019: హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో జాబ్స్

Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
Published by: Santhosh Kumar S
First published: December 6, 2019, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading