BEL Jobs 2019: బీఈఎల్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Bharat Electronics Limited Recruitment 2019 | దరఖాస్తులు ఎక్కువగా వస్తే రాతపరీక్ష ఉంటుంది. దాంతోపాటు డిప్లొమాలో వచ్చిన మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

news18-telugu
Updated: July 20, 2019, 3:16 PM IST
BEL Jobs 2019: బీఈఎల్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
BEL Jobs 2019: బీఈఎల్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 20, 2019, 3:16 PM IST
మీరు డిప్లొమా పాసయ్యారా? ఏదైనా ఓ మంచి కంపెనీలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL సంస్థ డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఘజియాబాద్‌లోని బీఈఎల్ యూనిట్ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ ప్రాక్టీస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో మొత్తం 100 డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జూలై 21 చివరి తేదీ. దరఖాస్తులు ఎక్కువగా వస్తే రాతపరీక్ష ఉంటుంది. దాంతోపాటు డిప్లొమాలో వచ్చిన మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అప్రెంటీస్ కాలవ్యవధి ఏడాది మాత్రమే. డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bharat Electronics Limited Recruitment: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు- 100

మెకానికల్- 29
కంప్యూటర్ సైన్స్- 15
మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ ప్రాక్టీస్- 10


ఎలక్ట్రానిక్స్- 32
ఎలక్ట్రికల్- 08
సివిల్- 06
వయస్సు- 2019 జూన్ 30 నాటికి 28 ఏళ్లు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
2016 జూలై 31 నాటికి రెండేళ్లు లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసినవాళ్లు అర్హులు.
స్టైపెండ్: నెలకు రూ.10,400.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

RRB Exam: ఆర్ఆర్‌బీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

BOB Jobs: బీటెక్ పాసయ్యారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...