BEL Jobs: భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... బీటెక్ అర్హత

BEL Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుకు నవంబర్ 2 చివరి తేదీ. దరఖాస్తు చేయాల్సిన ఆన్‌లైన్ లింక్ నోటిఫికేషన్‌లో ఉంటుంది.

news18-telugu
Updated: October 24, 2019, 11:01 AM IST
BEL Jobs: భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... బీటెక్ అర్హత
BEL Jobs: భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... బీటెక్ అర్హత (ఫ్రతీకాత్మక చిత్రం, image: BEL)
  • Share this:
బీటెక్ పాసైనవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో బీటెక్ అర్హతతో ఉద్యోగాలున్నాయి. ఇంజనీర్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌-BEL. కర్నాటకలోని బెంగళూరు, పంజాబ్‌లోని బఠిండాలోని బీఈఎల్ కేంద్రాల్లో మొత్తం 19 ఖాళీలున్నాయి. డీ & ఈ, టెస్టింగ్, ప్రొడక్షన్, పర్చేస్, మార్కెటింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లో వీరిని నియమించనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుకు నవంబర్ 2 చివరి తేదీ. దరఖాస్తు చేయాల్సిన ఆన్‌లైన్ లింక్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను www.bel-India.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పలు పోస్టుల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 19
ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్- 13
మెకానికల్ ఇంజనీర్- 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 2విద్యార్హత- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్, మెకానికల్‌ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పాసైతే చాలు.
వయస్సు- 2019 నవంబర్ 1 నాటికి గరిష్టంగా 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
అనుభవం- సంబంధిత అంశాల్లో కనీసం 6 నెలల అనుభం ఉండాలి.
వేతనం- రూ.23,000.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... డిప్లొమా, బీటెక్ పాసైతే చాలు

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... ఇంటర్, ఇంజనీరింగ్ అర్హత

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: October 24, 2019, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading